Mangalagiri: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహణ!
Mangalagiri: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
Mangalagiri: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహణ!
Mangalagiri: నేడు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వారి నుంచి అర్జీలను స్వీకరించారు. సుమారు మూడు గంటల పాటు 150 అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేశారు. సంబంధించి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వారి నుంచి అర్జీలను స్వీకరించారు. సుమారు మూడు గంటల పాటు 150 అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేశారు. సంబంధించి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.




