Tripurantakam: త్రిపురాంతకంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం!
Tripurantakam: త్రిపురాంతకంలోని స్వయంభూ శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు పద్మ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Tripurantakam: త్రిపురాంతకంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం!
Tripurantakam: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం లో స్వయంభువుగా బావిలో వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.. అర్చకులు ఉదయం నుండి అమ్మవారికి శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రికి పద్మ వాహనం అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పద్మ వాహనం పై ఆశీనులై ఉన్న బాలా త్రిపురసుందరీ దేవి కి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా జై బాల జైజై బాల అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. ఈ సందర్భంగా విజయవాడ కు చెందిన అమ్మవారి భక్తురాలు చేసిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.




