Mothkur: మోత్కూరులో వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్!

Mothkur: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో వ్యవసాయ మోటార్ల చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.2 లక్షల విలువైన 18 మోటార్లు, ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు.

RAMESH, MOTHUKUR
Published on: 11 Nov 2026 6:23 PM IST
Mothkur
X

Mothkur: మోత్కూరులో వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్!

మోత్కూరు: రైతుల వ్యవసాయ మోటార్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను మోత్కూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 18 విద్యుత్ మోటార్లతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన వాహనం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు, అడ్డగూడూరు, తిరుమలగిరి, రామన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ బోర్ల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లను ఈ ముఠా దొంగిలిస్తూ వస్తోంది. నిందితులు ముందుగా గ్రామాల శివార్లలో పగటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి మోటార్లను తొలగించి దొంగతనాలకు పాల్పడేవారు. అనంతరం వాటిని వివిధ ప్రాంతాల్లో పాత ఇనుప సామాను కొనుగోలు చేసే వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అరెస్టయిన నిందితుల వివరాలు:

ఒగ్గు నాగరాజు, తండ్రి బాలయ్య, వయస్సు 26 సంవత్సరాలు.

రావాని రమేష్, తండ్రి అంబయ్య, వయస్సు 32 సంవత్సరాలు.

రావాని శ్రీను, తండ్రి వెంకన్న, వయస్సు 25 సంవత్సరాలు.

పల్లపు మహేందర్, తండ్రి ఎల్లయ్య, వయస్సు 29 సంవత్సరాలు.

వీరంతా సూర్యాపేట జిల్లా పరిధిలోని తిరుమలగిరి ప్రాంతం, మోత్కూరు పరిసర గ్రామాలకు చెందినవారిగా ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు:

వ్యవసాయ విద్యుత్ మోటార్లు – 18 (వీటి విలువ సుమారు రూ.2 లక్షలు).

దొంగతనాలకు ఉపయోగించిన ఎర్టిగా కారు – TS-27-F-7111.

కటింగ్ ప్లయర్ – 1. స్పానర్లు – 2. హాకీ బ్లేడ్ – 1. మొబైల్ ఫోన్లు – 4.

పోలీసు అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు:

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అక్షాంశ్ యాదవ్, అదనపు ఎస్పీ లక్ష్మీ నారాయణ పర్యవేక్షణలో, చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ ఎం. రవి ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.

మోత్కూరు ఎస్‌ఐ కె. సతీష్, మోత్కూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది సునీల్, శివ, రవి, అనిల్, అఫ్సర్, అజీల్, ప్రవీణ్ తదితరులు నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. వ్యవసాయ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకుని, రైతులకు చెందిన సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. రైతుల ఆస్తుల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.

RAMESH, MOTHUKUR

RAMESH, MOTHUKUR