Chityal: పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55,000 ఆన్‌లైన్ మోసం!
Chityal: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్సైగా నమ్మించి గంత్ల రవీందర్ రెడ్డి నుంచి రూ.55,000 ఆన్‌లైన్ మోసం చేసిన ఇద్దరు నిందితులపై కేసు నమోదైంది.
Chityal: పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55,000 ఆన్‌లైన్ మోసం!
చిట్యాల: రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారిగా నమ్మించి ఒక వ్యక్తి నుంచి రూ.55,000/- ఆన్‌లైన్ ద్వారా మోసం చేసిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది. తేదీ 14.11.2026 న ఉదయం సుమారు 10:00 గంటలకు బాధితుడు గంత్ల రవీందర్ రెడ్డికి తాకూరి మల్లేష్, శ్రీనివాస్ రావు మొబైల్ నంబర్ 8790875631 ద్వారా ఫోన్ చేసి తాము రామన్నపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు.
పోలీస్ అధికారిగా నటిస్తూ బాధితుడి నమ్మకాన్ని సంపాదించి, డబ్బులు తీసుకురావడానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్‌ను చెప్పగా అది నమ్మి ఫోన్‌పే ద్వారా రూ.55,000/- పంపిస్తే, కానిస్టేబుల్ డ్రైవర్ ద్వారా ఆ మొత్తాన్ని నగదు రూపంలో తిరిగి అందజేస్తానని నమ్మబలికాడు. దీంతో బాధితుడు నిందితుడి మాటలను నిజమని న రూ.55,000/-లను వివిధ మొబైల్ నంబర్లకు ఫోన్‌పే ద్వారా బదిలీ చేశాడు. విషయం తెలుసుకున్న రామన్నపేట్ పోలీసు వారు కూరమను శ్రీనివాసు రావు ను అరెస్టు చేయటం జరిగింది.




