Choutuppal: చౌటుప్పల్‌ వద్ద జాతీయ రహదారి 65పై భారీ ట్రాఫిక్‌ జామ్‌

Choutuppal: దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ వద్ద 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

T RAMREDDY, BHONAGIRI
Published on: 25 Oct 2026 6:53 PM IST
Choutuppal
X

Choutuppal: చౌటుప్పల్‌ వద్ద జాతీయ రహదారి 65పై భారీ ట్రాఫిక్‌ జామ్‌

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ వద్ద జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దసరా పండుగ సెలవులు నేటితో ముగియడంతో.. సొంత గ్రామాలకు వెళ్లిన పట్టణవాసులు తిరిగి హైదరాబాద్‌ బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

మరోవైపు.. చౌటుప్పల్‌ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. దీంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

చౌటుప్పల్‌ పట్టణాన్ని దాటేందుకు వాహనదారులకు సుమారు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

T RAMREDDY, BHONAGIRI

T RAMREDDY, BHONAGIRI