Mothkur: తెలంగాణ జాతిపిత కేసీఆరే.. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డే: గాదరి కిశోర్!

Mothkur: మోత్కూరులో జరిగిన దీక్షా దివస్ సభలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆరేనని, ద్రోహి రేవంత్ రెడ్డేనని అన్నారు.

RAMESH, MOTHUKUR
Published on: 29 Nov 2026 4:58 PM IST
Mothkur
X

Mothkur: తెలంగాణ జాతిపిత కేసీఆరే.. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డే: గాదరి కిశోర్!

Mothkur: తెలంగాణకు ఎవరు అవునన్నా.. కాదన్నా కేసీఆరే జాతిపిత అని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా అదే మాట అన్నారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ దీక్ష దివస్ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం మొదలు పెట్టిన నాటి నుంచి ఆంధ్ర పాలకులు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారని, కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాతే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిందన్నారు. కెసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన తర్వాత కూడా ఆంధ్ర పాలకులు మళ్లీ కుట్రలకు తెర లేపారని, అయినా కేసీఆర్ ముందు చూపుతో 6 నెలల ఉద్యమ ప్రణాళిక చేసి దిశా నిర్దేశం చేశారన్నారు.

జార్ఖండ్ తరహా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసిఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించారని తెలిపారు. 2004లో కరీంనగర్ సభలో సోనియా గాంధీ కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఇస్తామని ప్రకటించి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందని, అయినా తెలంగాణ ఇవ్వలేదన్నారు. తెలంగాణ కోసం ఏనాడూ జై తెలంగాణ అని చంద్రబాబుతో కూడా కేసీఆర్ పొత్తు పెట్టుకొని చంద్రబాబుతో కూడా జై తెలంగాణ అనిపించారన్నారు.

32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి ఢిల్లీకి పోతున్న.. తెలంగాణ వచ్చాకే హైదరాబాద్లో అడుగు పెడతానని చెప్పి తెలంగాణ తెచ్చి మరి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన నేత అని కొనియాడారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో లేని, చంద్రబాబు బూట్లు నాకే రేవంత్ రెడ్డి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ ను ఏ సభ పెట్టిన తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని, కేసీఆర్ జపం చేస్తున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ జపమాల వేసుకుంటే బాగుంటుందన్నారు.

తెలంగాణ వచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా రేవంత్ రెడ్డి తన బాస్ చంద్రబాబుతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసి 50 లక్షల బ్యాగుతో దొరికిన దొంగ అన్నారు. కాంగ్రెస్ ను గాడిద అని, సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్ అదే కాంగ్రెస్లో సీఎం అయ్యాడన్నారు. కాలేశ్వరం జలాలతో మొదటగా బాగుపడింది తుంగతుర్తి నియోజకవర్గమేనన్నారు.

నేడు నాగార్జునసాగర్ లో చంద్రబాబు బహిరంగంగా పొక్క పెట్టి నీళ్లు ఎత్తుక పోతున్న ఇప్పటివరకు రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదన్నారు. ప్రపంచంలో హిట్లర్ ను ఎవడు ఆదర్శంగా తీసుకోవడని, అలాంటి హిట్లర్ ను ఆదర్శంగా తీసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణను పాలించడం దౌర్భాగ్యం అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, మోత్కూరు, తిరుమలగిరి మున్సిపాలిటీ తో సహా అభివృద్ధి పనులకు తెచ్చిన నిధులన్ని తన పీరియడ్ లో వచ్చినవేనన్నారు.

గతంలో ఇసుక విషయంలో తాను ఎవరి నుంచైనా పది లక్షలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు అన్నింటిని సరిదిద్దుకుంటామని, గులాబీ సైనికులకు తాను కాపలాదారుగా ఉంటానన్నారు. కేసీఆర్ ను సీఎం చేసుకోవడమే లక్ష్యంగా గులాబీ సైనికులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

RAMESH, MOTHUKUR

RAMESH, MOTHUKUR