Bhongir: భువనగిరిలో కాంగ్రెస్ 'పాక్', 'ఎస్ఐఆర్ ఫేజ్-2' సన్నాహక భేటీ!
Bhongir: భువనగిరిలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ 'పాక్', 'ఎస్ఐఆర్ ఫేజ్-2' సన్నాహక సమావేశం నిర్వహించారు.
Bhongir: భువనగిరిలో కాంగ్రెస్ 'పాక్', 'ఎస్ఐఆర్ ఫేజ్-2' సన్నాహక భేటీ!
భువనగిరి: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్‌లో నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ పార్టీ 'పాక్' (PAC) మరియు 'ఎస్ఐఆర్' (SIR Phase-2) సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ వేముల వీరేశంతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
Next Story




