TVS Raider 125: బైక్ లవర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే అప్‌డేట్లతో మార్కెట్‌లోకి వచ్చిన టీవీఎస్ రైడర్ 125

TVS Raider 125: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన రైడర్ 125 మోడల్‌ను మరింత అధునాతన హంగులతో అప్‌డేట్ చేసింది.

CR Reddy
Published on: 16 Oct 2026 9:00 AM IST
TVS Raider 125
X

TVS Raider 125

TVS Raider 125: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన రైడర్ 125 మోడల్‌ను మరింత అధునాతన హంగులతో అప్‌డేట్ చేసింది. పండుగ సీజన్‌లో విక్రయాలను మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఈ లేటెస్ట్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒకసారి అప్‌డేట్ చేసిన కంపెనీ, ఇప్పుడు మళ్ళీ సరికొత్త ఫీచర్లతో ఈ బైక్‌ను కస్టమర్ల ముందుకు తెచ్చింది. ప్రస్తుత అప్‌డేటెడ్ మోడల్స్ ఈ నెల ప్రారంభం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లకు చేరుకుంటున్నాయి.

ధరలు అలాగే కొత్త వేరియంట్ల వివరాలు

కొత్తగా విడుదలైన 2027 టీవీఎస్ రైడర్ 125 బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,00,330 నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ అప్‌డేట్లు బైక్‌లోని హై-ఎండ్ ట్రిమ్ లైన TFT DD అలాగే SXC DD వేరియంట్లలో ప్రధానంగా కనిపిస్తాయి. కొత్త ఎస్‌ఎక్స్‌సీ డీడీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,00,330 ఉండగా, టాప్ ఎండ్ టీఎఫ్‌టీ డీడీ వేరియంట్ ధర రూ.1,03,330గా నిర్ణయించారు. అంతేకాకుండా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో SSE అనే కొత్త ట్రిమ్‌ను కూడా పొందుపరిచారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, భద్రతా ఫీచర్లు

ఈ అప్‌డేట్‌లో అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే, సాధారణంగా 125 సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో ఎక్కడా కనిపించని ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఫీచర్‌ను ఇందులో చేర్చారు. ఈ టీసీఎస్ ఫీచర్‌ను రైడర్లు తమ అవసరానికి తగినట్లుగా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. దీనివల్ల జారే రోడ్లపై లేదా కఠినమైన పరిస్థితుల్లో బైక్ నడిపేటప్పుడు రైడర్లకు అదనపు కాన్ఫిడెన్స్ లభిస్తుంది. అలాగే ఎమర్జెన్సీ సమయంలో సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు వెనక వస్తున్న వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ ఫీచర్‌ను కూడా జోడించారు.

యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్, ఇతర మార్పులు

ప్రయాణ సమయాల్లో మొబైల్స్ ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ఇందులో 27W పవర్ అందించే యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‎ను ఏర్పాటు చేశారు. అలాగే బైక్ వెనుక టైర్ మునుపటి 110-సెక్షన్ నుంచి మరింత వెడల్పుగా ఉండే 120-సెక్షన్ టైర్‌గా మార్చారు. వెనుక వైపు చిన్న ప్యాటల్ డిస్క్ బ్రేక్‌కు బదులుగా పెద్ద సైజు కన్వెన్షనల్ డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. అయితే ఇందులో టర్న్ ఇండికేటర్ల కోసం హలోజన్ బల్బులనే కొనసాగించారు. వేరియంట్‌ను బట్టి లభించే టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా నెవిగేషన్‌తో పాటు 99కి పైగా కనెక్టెడ్ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు.

ఇంజన్ కెపాసిటీ, ఇతర విశేషాలు

ఈ అప్‌డేటెడ్ బైక్ మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు లేకుండా మునుపటి లాగే పవర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో అదే 125 సీసీ ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు. ఇది 3V హెడ్ అలాగే శక్తివంతమైన ఎగ్జాస్ట్ సౌండ్‌తో వస్తుంది. ఈ ఇంజన్ సుమారు 11 bhp పవర్‌ను, 11 Nm టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి జతగా 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం చేశారు. ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డీఆర్‌ఎల్‌లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, స్ప్లిట్ సీట్ ఆప్షన్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనో-షాక్ సస్పెన్షన్ వంటి అద్భుతమైన ఫీచర్లు యథావిధిగా కొనసాగుతున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.