తగ్గిన సేల్స్.. అయినా నంబర్ 1 స్థానంలో హోండా యాక్టివా! రేసులో దూసుకొస్తున్న టీవీఎస్, సుజుకి!

Top 5 Best-Selling Scooters in India: భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 స్కూటర్ల జాబితా విడుదల.

Arun Chilukuri
Published on: 18 Aug 2026 4:15 PM IST
తగ్గిన సేల్స్.. అయినా నంబర్ 1 స్థానంలో హోండా యాక్టివా! రేసులో దూసుకొస్తున్న టీవీఎస్, సుజుకి!
X

తగ్గిన సేల్స్.. అయినా నంబర్ 1 స్థానంలో హోండా యాక్టివా! రేసులో దూసుకొస్తున్న టీవీఎస్, సుజుకి!

Top 5 Best-Selling Scooters in India: భారతదేశంలో రోజువారీ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండటం, మంచి మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. తాజాగా వెల్లడైన వాహన విక్రయ గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్‌లో హోండా, టీవీఎస్, సుజుకి కంపెనీలకు చెందిన మోడళ్లు అత్యధిక అమ్మకాలతో టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో హోండా యాక్టివా మరోసారి తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, టీవీఎస్ జూపిటర్ రెండో స్థానంలో నిలిచింది.

టాప్-5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ల పూర్తి వివరాలు


హోండా యాక్టివా (Honda Activa) – నంబర్ వన్:

భారతీయ స్కూటర్ మార్కెట్‌లో హోండా యాక్టివా ఆధిపత్యం కొనసాగుతోంది. గత నెలలో ఈ స్కూటర్ 2.06 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే సేల్స్‌లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, నమ్మకమైన ఇంజిన్, మంచి మైలేజీ, సులభమైన నిర్వహణ కారణంగా యాక్టివా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.


టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) – రెండో స్థానం:

కుటుంబ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్న టీవీఎస్ జూపిటర్ 1.48 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. 2025లో ఇదే కాలంలో నమోదైన 1.25 లక్షల యూనిట్లతో పోలిస్తే జూపిటర్ విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది.


సుజుకి యాక్సెస్ (Suzuki Access) – మూడో స్థానం:

125cc సెగ్మెంట్‌లో సుజుకి యాక్సెస్ తన మార్కెట్ పట్టును నిలబెట్టుకుంది. గత నెలలో 82,000కు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది నమోదైన 68,000 యూనిట్లతో పోలిస్తే ఇది మెరుగైన ప్రదర్శన కావడం విశేషం.


టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS NTorq) – నాలుగో స్థానం:

స్పోర్టీ డిజైన్, హై-పెర్ఫార్మెన్స్ ఫీచర్లతో యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న టీవీఎస్ ఎన్‌టార్క్ గత నెలలో 38,000 యూనిట్ల విక్రయాలను సాధించింది. 2025లోని 26,000 యూనిట్లతో పోలిస్తే దీని సేల్స్ గణనీయంగా పెరిగాయి.


సుజుకి బర్గ్‌మ్యాన్ (Suzuki Burgman) – ఐదో స్థానం:

మ్యాక్సీ-స్కూటర్ స్టైల్ డిజైన్‌తో విభిన్నమైన లుక్ కోరుకునే వారికి సుజుకి బర్గ్‌మ్యాన్ ఉత్తమ ఎంపికగా మారింది. గత నెలలో బర్గ్‌మ్యాన్ అమ్మకాలు 30,000 యూనిట్లను దాటాయి. గత ఏడాది ఇదే కాలంలో 23,000 యూనిట్లుగా ఉన్న ఈ అమ్మకాలు ఏడాది కాలంలో మంచి వృద్ధిని కనబరిచాయి.

భారత స్కూటర్ మార్కెట్‌లో హోండా యాక్టివా లీడింగ్‌లో ఉన్నప్పటికీ.. టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్, టీవీఎస్ ఎన్‌టార్క్, సుజుకి బర్గ్‌మ్యాన్ మోడళ్ల విక్రయాలు ఏటికేడు పెరగడం గమనించదగ్గ పరిణామం. దీంతో దేశీయ ఆటోమొబైల్ రంగాన హోండా, టీవీఎస్, సుజుకి బ్రాండ్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story