Royal Enfield: లైట్ పడితే రంగులు మార్చే బైక్.. ప్రపంచంలో కేవలం 125 మందికే ఛాన్స్
Royal Enfield: భారతదేశపు ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకుంది.
Royal Enfield Classic 650
Royal Enfield: భారతదేశపు ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా 125వ యానివర్సరీ ఎడిషన్ హైపర్ షిఫ్ట్ క్లాసిక్ 650 బైక్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోటార్ సైకిల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.4,25,589గా నిర్ణయించారు. కంపెనీ తన సుదీర్ఘ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ బైక్‌ను అత్యంత ప్రత్యేకంగా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లలో కేవలం 125 యూనిట్లు మాత్రమే పరిమితంగా ఈ బైక్ అందుబాటులో ఉండనుంది. దీనికోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, నవంబర్ 2026 నాటికి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ ఎన్వర్సరీ ఎడిషన్‌లో ప్రసిద్ధమైన 650 ట్విన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించినప్పటికీ, దీని డిజైన్ అలాగే పెయింట్‌వర్క్ పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఈ బైక్ ప్రధాన ఆకర్ష హైపర్ షిఫ్ట్ ఫినిష్. దీనిపై కాంతి పడినప్పుడు రంగు ఎరుపు, ఆకుపచ్చ అలాగే గోల్డ్ షేడ్స్ మధ్య మారుతూ కనువిందు చేస్తుంది. 1901 నాటి తొలి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల నుంచి ప్రేరణ పొందిన ఈ బైక్ బ్రాస్ టోన్, డార్క్ కలర్ కాంబినేషన్‌తో వస్తోంది. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, మడ్‌గార్డ్స్ అలాగే హెడ్‌ల్యాంప్ నేసెల్పై ఈ ప్రత్యేక పెయింటింగ్ కనిపిస్తుంది. ట్యాంక్ చుట్టూ చేతితో వేసిన పిన్స్ట్రైప్స్, సైడ్ ప్యానెల్స్‌పై 125 సంవత్సరాల గోల్డెన్ క్రెస్ట్ దీని లుక్‌ను మరింత పెంచుతున్నాయి.
ఈ మోటార్ సైకిల్లో 647.95 సీసీ పవర్ఫుల్ ఫ్యూయల్-ఇంಜೆక్టెడ్, ఎస్ఓహెచ్సీ ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7,250 ఆర్పీఎం వద్ద సుమారు 47 పీఎస్ పవర్ అలాగే 5,650 ఆర్పీఎం వద్ద 52.3 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడింది. భద్రత కోసం ముందు భాగంలో 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో పాటు డ్యూయల్-చానల్ ఏబీఎస్ సిస్టమ్ అందించారు. బైక్‌లో 19-అంగుళాల ముందు వీల్, 18-అంగుళాల వెనుక వీల్ ఉన్నాయి. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14.7 లీటర్లు కాగా, మొత్తం బరువు 243 కిలోలుగా ఉంది.
క్లాసిక్ బైక్ ప్రియులను ఆకట్టుకునేలా వింటేజ్ స్టైల్లో బ్రౌన్ కలర్ లెదర్ సీట్‌ను ఈ ఎన్వర్సరీ ఎడిషన్‌లో ఇచ్చారు. దీనికి చేసిన కుట్టు బైక్ గోల్డెన్ డీటెయిలింగ్‌తో అద్భుతంగా సరిపోతుంది. ఆధునిక అవసరాలకు తగినట్లుగా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ అలాగే యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్లను పొందుపరిచారు. వైర్-స్పోక్ వీల్స్, గుండ్రటి అద్దాలు అలాగే బ్లాక్ కలర్ ట్విన్ ఎగ్జాస్ట్ పైపులు ఈ బైక్ క్లాసిక్ డిజైన్‌ను పరిపూర్ణం చేస్తాయి. అరుదైన సేకరణలను ఇష్టపడే బైకర్లకు ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలవనుంది.




