Electric Car: ఒక్క ఛార్జ్‌తో 449 కిలోమీటర్లు.. 80,000 కుటుంబాలు మెచ్చిన ఎలక్ట్రిక్ కార్
Electric Car: ఎంజీ మోటార్ ఇండియా సంస్థ 2024 సెప్టెంబర్‌లో భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన విండ్సర్ ఈవీ సరికొత్త చరిత్ర సృష్టించింది.
MG Windsor EV
Electric Car: ఎంజీ మోటార్ ఇండియా సంస్థ 2024 సెప్టెంబర్‌లో భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన విండ్సర్ ఈవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. క్రాసోవర్ కేటగిరీలో అడుగుపెట్టిన ఈ మోడల్ స్వల్ప కాలంలోనే దేశంలో అత్యధికంగా అమ్ముడైన నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 80,000 కంటే ఎక్కువ కార్లు విక్రయమై భారతదేశంలో ఈవీ మార్కెట్‌ను ఏలాయి. అయితే ఇటీవలి కాలంలో విక్రయాలు కాస్త తగ్గడంతో మళ్లీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ సిద్ధమైంది.
కొత్త ఇండల్జ్ ఎడిషన్ టీజర్ విడుదల
సేల్స్‌ను మళ్లీ పుంజుకునేలా చేయడానికి ఎంజీ మోటార్ సంస్థ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. గతంలో తీసుకొచ్చిన ఇన్స్పైర్ ఎడిషన్ తరహాలోనే ఈ కొత్త మోడల్లోనూ పలు డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు పరిచయం చేయనున్నారు. కొత్త రంగులతో పాటు ప్రత్యేకమైన బ్యాడ్జింగ్, విలాసవంతమైన ఇంటీరియర్ సీటింగ్ అమరికలు ఈ మోడల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
అదే స్టైల్, కొత్త ఆలివ్ బ్రౌన్ షేడ్
ప్రస్తుతం విడుదల చేసిన టీజర్ ఆధారంగా వాహనం ముందు వైపు ఉండే కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ల డిజైన్‌లో ఎలాంటి పెద్ద మార్పులు లేవు. కార్ పరిమాణం కూడా సాధారణ విండ్సర్ ఈవీ లాగే ఉంటుంది. ఇందులో ప్రధానంగా కనిపించే మార్పు ఆకర్షణీయమైన 'ఆలివ్ బ్రౌన్' బాడీ రంగు. దీనికి తోడు కొత్త అల్లాయ్ వీల్స్, డాష్‌క్యామ్, ప్రత్యేక స్టైలింగ్ యాక్సెసరీలు ఈ ఎడిషన్‌లో ఉండే అవకాశం ఉంది.
అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లు
కార్ లోపలి భాగంలో 15.6 అంగుళాల భారీ సెంటర్ స్క్రీన్, ఎంబియంట్ లైటింగ్, విశాలమైన పానోరమిక్ గ్లాస్ రూఫ్, వెనుక ఏసీ వెంట్స్ లభిస్తాయి. గత మోడల్లో ఉన్న సౌకర్యవంతమైన కేబిన్ అనుభూతిని ఇందులో మరింత మెరుగుపరచనున్నారు. కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల కనెక్టివిటీ ఆప్షన్లతో ఈ కారు రూపుదిద్దుకుంటోంది.
బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ వివరాలు
ఇండల్జ్ ఎడిషన్ ఇంజిన్, బ్యాటరీ సామర్థ్యంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లలో 37.9kWh, 52.9kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. చిన్న బ్యాటరీ ప్యాక్ ఒక ఛార్జ్‌పై 332 కిలోమీటర్లు ప్రయాణిస్తే, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఏకంగా 449 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.14.70 లక్షల నుంచి రూ.17.0 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.




