Mahindra: మార్కెట్‌ను ఏలేందుకు వస్తున్న మహీంద్రా.. త్వరలో రానున్న 4 కొత్త ఎస్‌యూవీలు

Mahindra: ఇప్పటికే అద్భుతమైన కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న మహీంద్రా కంపెనీ, త్వరలోనే ఏకంగా నాలుగు కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది.

CR Reddy
Published on: 19 Oct 2026 9:47 AM IST
Mahindra
X

Mahindra

Mahindra: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల తయారీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేశీయ దిగ్గజం మహీంద్రా, ఇప్పుడు మరిన్ని అధునాతన మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అద్భుతమైన కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ, త్వరలోనే ఏకంగా నాలుగు కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. ఇందులో శక్తివంతమైన ఆఫ్‌రోడర్ల నుంచి అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్లు అలాగే స్టైలిష్ పికప్ ట్రక్కులు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో లాంచ్ కానున్న ఆ నాలుగు అద్భుతమైన కార్ల విశేషాలు తెలుసుకుందాం.

1. మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్

యూవతలో విపరీతమైన క్రేజ్ ఉన్న 3-డోర్ థార్‌ను మరింత మోడర్న్ లుక్‌తో తీసుకురానున్నారు. దీని డిజైన్‌లో భాగంగా కొత్త ఫ్రంట్ గ్రిల్, థార్ రాక్స్ మాదిరిగా వచ్చే ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్ అందించనున్నారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ అలాగే ఏడీఏఎస్ భద్రతా ఫీచర్లు ఉండనున్నాయి. ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు లేకుండా 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ అలాగే 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో ఈ ఏడాది పండగ సీజన్‌లో ఇది రోడ్లపైకి రానుంది.

2. మహీంద్రా విజన్ ఎస్

సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని తట్టుకునేందుకు మహీంద్రా సరికొత్త NU-IQ ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును అభివృద్ధి చేస్తోంది. దీని బాక్సీ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉండనుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ఏడీఏఎస్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక హంగులు ఉంటాయి. పర్ఫామెన్స్ కోసం 1.2-లీటర్ టర్బో పెట్రోల్ అలాగే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లను అమర్చనున్నారు. అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని ఈ మోడల్ ఆగస్టు 2027 నాటికి లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి.

3. మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోయేందుకు బోర్న్ ఎలెక్ట్రిక్ సిరీస్‌లో భాగంగా ఈ ఎస్‌యూవీని తీసుకువస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ అలాగే మారుతి ఈ విటారా కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. కేబిన్ లోపల విశాలమైన స్థలంతో పాటు మూడు స్క్రీన్ల డాష్‌బోర్డ్ సెటప్, భారీ గ్లాస్ రూఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందులో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా 59 కిలోవాట్ అవర్, 70 కిలోవాట్ అవర్ అలాగే 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఇది 2027 మొదటి త్రైమాసికంలో మార్కెట్లో అడుగుపెట్టనుంది.

4. మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైల్ పికప్

పాపులర్ స్కార్పియో ఎన్ ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా ఈ లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్కును రూపొందించారు. దీనికి సంబంధించిన బాడీ క్లాడింగ్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్-షేప్ డీఆర్ఎల్లు, 18-ఇంచుల పెద్ద వీల్స్ రగ్డ్ లుక్‌ను ఇస్తాయి. క్యాబిన్ లోపల లగ్జరీ కార్ల మాదిరిగా డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, లెవల్-2 ఏడీఏఎస్ అమర్చనున్నారు. ఇందులో శక్తివంతమైన 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో పాటు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా లభించే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన పికప్ ను 2027 ఏప్రిల్ నాటికి విడుదల కానుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.