New SUVs: హోండా నుంచి టాటా వరకు కొత్త కార్ల జాతర.. ఈ మోడల్స్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే

New SUVs: భారతదేశంలో నవరాత్రి, దసరా, దీపావళి పండుగ సీజన్ వస్తోందంటే చాలు ఆటోమొబైల్ మార్కెట్ సరికొత్త కార్ల లాంచ్‌లతో కళకళలాడుతుంది.

CR Reddy
Published on: 27 Sept 2026 11:15 AM IST
Honda Elevate Facelift
X

Honda Elevate Facelift

New SUVs: భారతదేశంలో నవరాత్రి, దసరా, దీపావళి పండుగ సీజన్ వస్తోందంటే చాలు ఆటోమొబైల్ మార్కెట్ సరికొత్త కార్ల లాంచ్‌లతో కళకళలాడుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన హోండా, హ్యుందాయ్, రెనాల్ట్, టాటా మోటర్స్ తమ సరికొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల నుంచి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల వరకు అన్నీ రకాల కార్లు ఈ జాబితాలో ఉన్నాయి. మీరు కనుక కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉంటే, ఈ రాబోయే 4 కొత్త కార్ల ప్రత్యేకతలు తెలుసుకుందాం.

1. హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్

హోండా కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అక్టోబర్ 6, 2026న లాంచ్ చేయనుంది. ఈ కొత్త కారులో రివైజ్డ్ ఫ్రంట్, రేర్ బంపర్లు, కొత్త రేడియేటర్ గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌లైట్లు, టెయిల్-లైట్ గ్రాఫిక్స్, కొత్త 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ రానున్నాయి. ఇంటీరియర్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్, 360-డిగ్రీ కెమెరా, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, అప్‌డేటెడ్ ADAS ఫీచర్లు లభిస్తాయి. ఇంజిన్ పరంగా ప్రస్తుతమున్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ యథావిధిగా కొనసాగుతుంది.

2. హ్యుందాయ్ బేయాన్

హ్యుందాయ్ సంస్థ అక్టోబర్ నెలలో తన కొత్త ఎస్‌యూవీ బేయాన్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. సుమారు 4.2 మీటర్ల పొడవు ఉండే ఈ ఎస్‌యూవీ క్రెటా కంటే దిగువ సెగ్మెంట్‌లో రానుంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, పవర్డ్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉంటాయి. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు పెట్రోల్-సీఎన్‌జీ ఆప్షన్ కూడా లభించే అవకాశం ఉంది.

3. రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్

భారత మార్కెట్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు సరికొత్త హంగులతో హైబ్రిడ్ రూపంలో రానుంది. ఇందులో 1.8-లీటర్ పెട്രోల్ ఇంజిన్‌తో పాటు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ లభిస్తుంది. E-Tech 160 టెక్నాలజీతో కూడిన ఈ హైబ్రిడ్ సిస్టమ్ 160hp పవర్‌ను అందిస్తుంది. ఇందులో 1.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందని, సిటీ డ్రైవింగ్‌లో సుమారు 80 శాతం దూరం కేవలం ఈవీ మోడ్‌లోనే ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది.

4. టాటా సఫారి ఈవీ

టాటా మోటెర్స్ నవంబర్ నాటికి తమ తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సఫారి ఈవీని మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. హారియర్ ఈవీ మాదిరిగానే ఇందులో సింగిల్-మోటార్ రియర్-వీల్ డ్రైవ్, డ్యూయల్-మోటార్ AWD సెటప్ ఇవ్వనున్నారు. RWD వెర్షన్‌లో 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండగా, ఫుల్ ఛార్జ్‌పై ఇది దాదాపు 600 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందించనుంది. ఇందులో V2L బైడైరెక్షనల్ ఛార్జింగ్, 12.3-అంగుళాల ప్యాసింజర్ టచ్‌స్క్రీన్ వంటి అదిరిపోయే ఫీచర్లు వస్తాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.