Honda: గుంతల రోడ్లు అయినా గాల్లో తేలిపోవాల్సిందే.. హోండా అడ్వెంచర్ బైక్స్ వచ్చేశాయ్
Honda: భారత మార్కెట్లో హోండా XR300L, XR300 Rally అడ్వెంచర్ బైక్స్ లాంచ్ అయ్యాయి. ప్రారంభ ధర రూ.1.83 లక్షలుగా నిర్ణయించారు.
Honda XR300L
Honda: దేశంలో అడ్వెంచర్ బైక్స్ ఇష్టపడే వారి కోసం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హోండా XR300L మోడల్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరను రూ.1.83 లక్షలుగా, హోండా XR300 Rally వర్షన్ ధరను రూ.2.08 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఆఫీసు ప్రయాణాలతో పాటు వీకెండ్‌లో రాళ్లూ రప్పల దారుల్లో లాంగ్ రైడింగ్ చేయడానికి వీలుగా ఉండేలా ఈ బైకులను తీర్చిదిద్దారు.
రెండు బైక్స్ స్టైల్, మైండ్ సెట్ వేరు
ఈ రెండు బైక్స్ ఒకే ప్లాట్‌ఫారమ్ మీద నిర్మించినప్పటికీ, వీటి డిజైన్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. హోండా XR300L ని ప్యూర్ ఆఫ్-రోడింగ్, డర్ట్ ట్రాక్స్ మీద దూసుకెళ్లేలా సింపుల్‌గా డిజైన్ చేశారు. మరోవైపు XR300 Rally మోడల్‌లో పెద్ద ఫెయిరింగ్, ఎత్తైన విండ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇది హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు గాలి తాకిడి నుంచి రైడర్‌ను కాపాడుతూ సుదీర్ఘ ప్రయాణాన్ని ఎంతో హాయిగా మారుస్తుంది.
ఇంజిన్ పవర్, గేర్‌బాక్స్ పెర్ఫార్మెన్స్
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండింటిలోనూ 286cc లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 24.3bhp పవర్, 26.5Nm టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేశారు. స్మూత్ రైడింగ్ అనుభూతిని ఇచ్చే హోండా రిఫైన్డ్ ఇంజిన్ కొత్త వారికి, పాత రైడర్లకు నచ్చుతుంది. భారీ అడ్వెంచర్ బైకులతో పోలిస్తే వీటి బరువు చాలా తక్కువగా ఉండటం విశేషం.
సస్పెన్షన్, బ్రేకింగ్ హార్డ్‌వేర్
గుంతల రోడ్లలో కూడా ఈజీగా వెళ్లేందుకు సస్పెన్షన్ హార్డ్‌వేర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, స్పోక్ వీల్స్, ఆల్-టెరైన్ టైర్లు అమర్చడం వల్ల బురద, గులకరాళ్ల దారుల్లో ఎలాంటి భయం లేకుండా వేగంగా ప్రయాణించవచ్చు.
మార్కెట్లో పోటీ, ఇతర బైక్స్
ధర విషయంలో హోండా వ్యూహాత్మక అడుగు వేసింది. రూ.1.83 లక్షల ప్రారంభ ధరతో హీరో ఎక్స్‌పల్స్ కస్టమర్లకు ఇదొక సూపర్ అప్‌గ్రేడ్‌లా మారుతుంది. కేటీఎం అడ్వెంచర్ 250, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కొనాలనుకునే వారికి లైట్‌వెయిట్, తక్కువ ధరలో దొరికే బెస్ట్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. తక్కువ బడ్జెట్‌లో హోండా భరోసాతో వచ్చే పర్ఫెక్ట్ అడ్వెంచర్ ప్యాకేజీ ఇది.




