Hero: సరికొత్త హంగులతో హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V.. అక్టోబర్ 16న మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ

Hero: భారతీయ మార్కెట్లో 160cc స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌కు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది.

CR Reddy
Published on: 14 Oct 2026 11:58 AM IST
Hero Xtreme 160R 4V
X

Hero Xtreme 160R 4V 

Hero: భారతీయ మార్కెట్లో 160cc స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌కు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ విభాగంలో ఇప్పటికే కొన్ని ప్రముఖ బ్రాండ్లు గట్టి పోటీని ఇస్తుండగా, దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన పాపులర్ బైక్ ఎక్స్‌ట్రీమ్ 160R 4V కొత్త మోడల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సరికొత్త డిజైన్, మోడ్రన్ ఫీచర్లతో రూపొందిన ఈ బైక్ అక్టోబర్ 16, 2026 న అధికారికంగా మార్కెట్లోకి రానుంది.

వస్తున్న కొత్త 2026 మోడల్ ఎక్స్‌ట్రీమ్ బైక్‌లో సరికొత్త డిజైన్ మార్పులు చూడవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ ప్రాంతం, సీట్ డిజైన్, హెడ్‌లైట్లు, టెయిల్ లైట్ల రూపురేఖలను మరింత స్టైలిష్‌గా మార్చారు. రైడర్ సులభంగా డ్రైవ్ చేయడానికి వీలుగా సీటింగ్ పొజిషన్, హ్యాండిల్ బార్ యాంగిల్స్‌లో కూడా స్వల్ప మార్పులు చేశారు. ప్రయాణికుల భద్రతను మరింత పెంచడానికి బ్రేకింగ్ సిస్టమ్‌ను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్‌లో సాధారణ ఎల్‌సీడీ డిస్‌ప్లే మాత్రమే ఇస్తున్నారు. కానీ ఈ కొత్త వెర్షన్‌లో టెక్కీలను ఆకట్టుకునేలా సరికొత్త టీఎఫ్‌టీ క్లస్టర్‌ను అందించనున్నారు. దీని ద్వారా గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ ఆప్షన్ లభించే అవకాశం ఉంది. దీనితో పాటు ఆటో బ్రైట్‌నెస్, లాప్ టైమర్, లాంగ్ రైడ్స్‌ను సులభతరం చేసే క్రూజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్‌లో జతచేసే ఛాన్స్ ఉంది.

ఇంజన్ పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. ఇందులో ఇప్పటికే ఉన్న 163.2cc సింగిల్ సిలిండర్ 4V ఇంజిన్‌ను కొనసాగించనున్నారు. ఈ శక్తివంతమైన ఇంజిన్ 16.9bhp పవర్‌తో పాటు 14.9Nm టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవేలపై సులువుగా ప్రయాణించేలా ఇంజిన్‌ను మరింత స్మూత్‌గా ట్యూన్ చేశారు.

ప్రస్తుతం ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.35 లక్షల నుంచి రూ.1.38 లక్షల మధ్య ఉంది. అయితే కొత్త డిజైన్, అడ్వాన్స్‌డ్ టీఎఫ్‌టీ ఫీచర్లు రావడం వల్ల ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రత్యర్థి బ్రాండ్ల బైక్‌లతో గట్టి పోటీ ఇచ్చేలా హీరో సంస్థ దీని ధరను సరసమైన రీతిలోనే ఉంచే అవకాశం కనిపిస్తోంది.

స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే యువ బైక్ రైడర్లకు ఈ సరికొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V చక్కటి ఎంపికగా నిలుస్తుంది. అక్టోబర్ 16న లాంచ్ కానున్న ఈ బైక్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.