Hatchbacks: కార్ లవర్లకు దీపావళి బొనాంజా.. హ్యాచ్‌బ్యాక్ కార్లపై ఏకంగా రూ.1.45 లక్షల వరకు తగ్గింపు
Hatchbacks: దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని కొత్త కారు సొంతం చేసుకోవాలనుకునే మధ్యతరగతి వినియోగదారులకు ఆటోమొబైల్ కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి.
Hatchbacks
Hatchbacks: దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని కొత్త కారు సొంతం చేసుకోవాలనుకునే మధ్యతరగతి వినియోగదారులకు ఆటోమొబైల్ కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, హ్యుందాయ్, సిట్రోయెన్ వంటి దిగ్గజ కంపెనీలు తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లపై ఊహించని రేంజ్లో డిస్కౌంట్లు ఇస్తున్నాయి. పండుగ రద్దీని వాడుకుంటూ అమ్మకాలు పెంచుకోవడానికి నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో భారీ ప్రయోజనాలను అందిస్తున్నాయి. కొన్ని కార్లపై ఏకంగా రూ.1.45 లక్షల వరకు ఆదా చేసుకునే అరుదైన అవకాశం దక్కింది.
టాటా టియాగో ఈవీపై రికార్డు డిస్కౌంట్
ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్న వారికి టాటా టియాగో ఈవీ అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ కారు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ పాత స్టాక్‌పై కంపెనీ ఏకంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు ఉన్నాయి. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షలుగా ఉన్న ఈ ఈవీ, ఒకే ఛార్జ్‌పై 293 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి పండుగ వేళ ఈ ఆఫర్ పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
సిట్రోయెన్ C3, మారుతి స్విఫ్ట్‌పై పండుగ ధమాకా
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ తమ C3 మోడల్‌పై దీపావళి కానుకగా రూ.1.18 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 1.2 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభించే ఈ కారు ఆరంభ ధర రూ.4.99 లక్షలుగా ఉంది. మరోవైపు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న మారుతి స్విఫ్ట్ 'బ్లిట్జ్ ఎడిషన్' కొనుగోలుపై రూ.71,000 వరకు బెనిఫిట్స్ అందుతున్నాయి. సీఎన్జీ ఆప్షన్ కూడా ఉన్న స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా ఉండి, తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారింది.
బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లపై ఆఫర్ల వర్షం
ఇతర బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లపై కూడా కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. టయోటా గ్లాంజా పాత మోడల్‌పై రూ.70,000 వరకు, మారుతి సెలెరియోపై రూ.67,500, వ్యాగన్ ఆర్‌పై రూ.67,000 వరకు తగ్గింపు లభిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌పై రూ.60,000, ఆల్టో K10పై రూ.57,500 వరకు పండుగ సడలింపులు ఇచ్చారు. అంతేకాకుండా హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్ మోడళ్లపై కూడా రూ.55,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
బుక్ చేసుకునే ముందు ఇవి గమనించండి
ఈ డిస్కౌంట్ ఆఫర్లు అన్నీ వేరియంట్లు, రంగులు, అన్ని నగరాల్లో ఒకేలా ఉండవనే విషయం కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి. పూర్తి డిస్కౌంట్ పొందడానికి పాత కారును ఎక్స్ఛేంజ్ చేయాల్సి రావచ్చు లేదా కొన్ని నిర్దిష్ట షరతులు వర్తించవచ్చు. అందువల్ల షోరూమ్‌కు వెళ్లి బుకింగ్ చేసుకునే ముందే డీలర్ వద్ద అందుబాటులో ఉన్న స్టాక్, ఫైనల్ ఆన్-రోడ్ ధర, ఇన్సూరెన్స్ తగ్గింపుల సమాచారంపై స్పష్టత తీసుకోవడం మంచిది.




