Daily Astrology: సెప్టెంబర్ 22 రాశిఫలాలు - ఈ రాశుల జీవితాల్లో అనుకోని మార్పులు...ఆర్థికంగా స్థిరత్వం
సెప్టెంబర్ 22న ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం.
Daily Astrology: సెప్టెంబర్ 22న కొన్ని రాశుల జీవితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో ఇంతకాలం ఎదురుచూస్తున్న మార్పులకు సంకేతాలు కనిపిస్తాయి. కొందరికి ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తే, మరికొందరు ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సహకారం, మనోధైర్యం ఉన్నవారికి క్లిష్టమైన పరిస్థితులను కూడా సులభంగా అధిగమించే అవకాశం ఉంటుంది.
మేషరాశి
ఈ రోజు మేష రాశివారికి పనితీరుకు గుర్తింపు లభించే రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో పోటీ ఉన్నా, మీ నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్లగలుగుతారు. డబ్బు విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలిస్తుంది.
వృషభరాశి
వృషభ రాశివారికి అనుకున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి సమయం గడపడం మానసిక ప్రశాంతత ఇస్తుంది.
మిథునరాశి
మిథున రాశివారికి అవకాశాలు కనిపించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఆలోచనతో వ్యవహరించాలి. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. స్థిరాస్తికి సంబంధించిన అంశాల్లో పురోగతి ఉండవచ్చు. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు తలెత్తకుండా మాటలపై నియంత్రణ అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
కర్కాటకరాశి
కర్కాటక రాశివారికి కొంతకాలంగా నిలిచిపోయిన పనుల్లో కదలిక మొదలవుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా అదనపు బాధ్యతలకు సంబంధించిన వార్తలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలను కొద్దిరోజులు వాయిదా వేసి పరిస్థితిని గమనించడం మంచిది. ఆదాయం, ఖర్చులు దాదాపు సమంగా సాగుతాయి.
సింహరాశి
సింహ రాశివారు తమపై నమ్మకంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం తొందర అవసరం లేదు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. దూర ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
కన్యారాశి
కన్య రాశివారికి ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావచ్చు. ఆర్థికంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇంట్లో శుభవార్త ఆనందాన్ని పెంచుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మనశ్శాంతిని ఇస్తుంది.
తులారాశి
తుల రాశివారు పట్టుదలతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో ఆశించిన మార్పులు కనిపించవచ్చు. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం కీలకంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
వృశ్చికరాశి
వృశ్చిక రాశివారికి తమ సామర్థ్యాన్ని చాటుకునే సందర్భాలు ఎదురవుతాయి. ఇంతకాలం ఎదురైన ఆటంకాలు క్రమంగా తొలగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అయితే ఆదాయం పెరిగిందని అవసరం లేని ఖర్చులు చేయకండి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
ధనుస్సురాశి
ధనుస్సు రాశివారికి ప్రారంభించిన పనులు సమయానికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రశంసలు, గౌరవం లభించవచ్చు. కొందరికి స్థానచలనం లేదా ఉద్యోగ సంబంధ మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు రావచ్చు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మకరరాశి
మకర రాశివారికి ఉద్యోగం, వ్యాపారంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే సహనంతో వ్యవహరిస్తే పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు. కుటుంబ విషయాల్లో మాటపట్టింపులకు దూరంగా ఉండాలి. ఆదాయాన్ని మించే ఖర్చులు రాకుండా ముందుగానే ప్రణాళిక వేసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కుంభరాశి
కుంభ రాశివారికి తెలివైన నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగంలో సమస్యలను సమర్థంగా పరిష్కరించి ప్రశంసలు పొందవచ్చు. వ్యాపారంలో అనుభవం ఉపయోగపడుతుంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే బంధాలు మరింత బలపడతాయి.
మీనరాశి
మీన రాశివారికి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో ధైర్యంగా ముందడుగు వేస్తే విజయానికి మార్గం ఏర్పడుతుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనిలో కదలిక రావచ్చు. ఆర్థికంగా మంచి సమయం. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులపై ఆలోచించవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.




