Daily Astrology: అక్టోబర్ 8 రాశిఫలాలు - ఈ రాశులకు ఈరోజు అదృష్టయోగం...అనుకోని లాభాలు
అక్టోబర్ 8న ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కొన్ని రాశులకు ఈరోజు అదృష్టయోగం కలగలబోతున్నది. అవేంటో తెలుసుకుందాం.
Daily Astrology: అక్టోబర్ 8, గురువారం రోజున భాద్రపద బహుళ పక్ష త్రయోదశి రాత్రి 10:15 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. పూర్వఫల్గుని నక్షత్రం రాత్రి 9:20 గంటల వరకు, అనంతరం ఉత్తరఫల్గుణి ఉంటుంది. శుక్ల యోగం రాత్రి 12:58 గంటల వరకు ఉండగా, ఆ తర్వాత బ్రహ్మ యోగం ప్రారంభమవుతుంది. ఉదయం 10:43 గంటల వరకు గరజి కరణం, రాత్రి 10:15 వరకు వణిజ కరణం కొనసాగి, ఆ తర్వాత భద్ర (విష్టి) కరణం వస్తుంది. త్రయోదశి, చతుర్దశి ప్రభావం ఉన్న ఈ రోజు ఆధ్యాత్మికంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం ముఖ్యమైన విషయం. కొందరికి నిలిచిపోయిన పనులు కదలగా, మరికొందరికి బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా మాట, ప్రయాణం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల్లో సంయమనం పాటిస్తే రోజు మరింత అనుకూలంగా మారుతుంది.
మేషరాశి
మేషరాశివారికి ఈ రోజు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది. పూజలు, ధార్మిక కార్యక్రమాలు లేదా దేవాలయ దర్శనాల్లో పాల్గొనే అవకాశం ఉంది. చాలాకాలంగా నిలిచిన పనుల్లో కదలిక కనిపిస్తుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి కొత్త అవకాశం తలుపుతట్టవచ్చు. అయితే సన్నిహితుల విషయంలో ప్రతి విషయాన్నీ వెంటనే నమ్మకుండా కొంత జాగ్రత్త అవసరం.
వృషభరాశి
బాధ్యతలు పెరిగే రోజు. మీపై నమ్మకంతో అప్పగించిన పనులను నిర్లక్ష్యం చేయకుండా పూర్తిచేయాలి. ముఖ్యంగా కోపంలో మాట్లాడిన ఒక్క మాట కూడా అనవసర సమస్యకు దారితీయవచ్చు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. సాయంత్రం కుటుంబంతో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
మిథునరాశి
మిథునరాశివారు అనుకున్న పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో సంతోషాన్ని కలిగించే సమాచారం అందవచ్చు. గతంలో ఇబ్బంది పెట్టిన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపార పెట్టుబడుల్లో మాత్రం లాభం కనిపించిందని వెంటనే నిర్ణయం తీసుకోకుండా అన్ని అంశాలను పరిశీలించాలి.
కర్కాటకరాశి
ఈ రోజు కర్కాటకరాశివారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా నిలుస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి వచ్చినా ఆవేశంతో స్పందించకండి. సాధ్యమైనంత వరకు అనవసర ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిది. ఇంటి వాతావరణంలో ప్రశాంతతను కాపాడుకోవడం మీకు మేలు చేస్తుంది.
సింహరాశి
సింహరాశివారికి చేపట్టిన పనులను పూర్తి చేసే శక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చులు అనుకోకుండా పెరగవచ్చు. కుటుంబానికి సమయం కేటాయించడం అవసరం. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు మరికొంత ఓపికతో ముందుకు సాగాలి. ఆలస్యం వచ్చినంత మాత్రాన ప్రయత్నం ఆపకూడదు.
కన్యారాశి
కన్యారాశివారు ఈ రోజు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాన్ని పెద్ద వాదనగా మార్చకుండా మౌనం పాటించడం మంచిది. ఏ పని చేసినా ముందుగా ప్రణాళిక వేసుకుంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు ఆలోచన కార్యరూపం దాల్చవచ్చు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మనసుకు ప్రశాంతత ఇస్తుంది.
తులారాశి
ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కొంత ఆర్థిక ఒత్తిడి ఎదురైనా పరిస్థితిని చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశాజనకమైన సమాచారం రావచ్చు. ఉద్యోగస్తుల పనితీరు పై అధికారుల దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా వారితో మాట్లాడే విధానం మీకు అనుకూల ఫలితాలను తీసుకురాగలదు. ఉత్సాహంగా పనిచేస్తే కొత్త అవకాశాలు కనిపిస్తాయి.
వృశ్చికరాశి
వృశ్చికరాశివారికి ఈ రోజు బాధ్యతలు ఒకేసారి పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు లేదా అధికారిక వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. ప్రయాణించే సమయంలో జాగ్రత్త తప్పనిసరి. ఆర్థికంగా లాభదాయకమైన పరిణామాలు చోటుచేసుకోవచ్చు. స్థిరాస్తికి సంబంధించిన ఆలోచనలు ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయి.
ధనుస్సురాశి
చేపట్టిన పనిలో ఊహించని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకండి. ఈ రోజు మీకు కావాల్సింది ముందుగా మానసిక స్థైర్యం. అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థికంగా ఉపశమనం ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఏకాగ్రతే విజయానికి ప్రధాన కారణం అవుతుంది.
మకరరాశి
మకరరాశివారికి పనిభారం, మానసిక ఒత్తిడి రెండూ పెరగవచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉన్నా వ్యాపారంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడుల కోసం అప్పు చేయాలనే ఆలోచన ఉంటే తొందరపడకండి. అనుభవం ఉన్న పెద్దల సూచనలు తీసుకోవడం మంచిది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కుంభరాశి
కుంభరాశివారు తమ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తారు. కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతికి సంబంధించిన ఆశాజనక పరిణామాలు కనిపించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ముఖ్యం.
మీనరాశి
కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు వచ్చినా వాటిని పెద్ద సమస్యలుగా మార్చకుండా కూర్చొని మాట్లాడుకోవాలి. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేసే అవకాశం ఉంది. అవసరమైన సమయంలో డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ లేదా పెట్టుబడుల కోసం అవసరమైన నిధులను సమకూర్చుకునే మార్గం కనిపిస్తుంది. కుటుంబ ఐక్యతను కాపాడుకోవడం ఈ రోజు ముఖ్యమైన విషయం.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.




