Daily Astrology: రాశిఫలాలు - శివయోగంతో ఈ రాశులకు అదృష్టం...అనుకోని విజయాలు

జూన్ 24, 2026 బుధవారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. శివయోగం ప్రభాదం, దశమి తిథి ప్రభావం ఎలా ఉంటుందో గమనిద్దాం.

Balachander
Published on: 24 Jun 2026 7:58 AM IST
Daily Astrology: రాశిఫలాలు - శివయోగంతో ఈ రాశులకు అదృష్టం...అనుకోని విజయాలు
X

Daily Astrology: శ్రీ పరాభవ నామ సంవత్సరంలో నిజ జ్యేష్ట మాస శుక్ల పక్ష దశమి తిథి ప్రభావంతో జూన్‌ 24, బుధవారం రోజు అనేక రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 6.12 గంటల వరకు దశమి తిథి కొనసాగి అనంతరం ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. చిత్త నక్షత్రం మధ్యాహ్నం 1.59 గంటల వరకు ఉండగా, తరువాత స్వాతి నక్షత్ర ప్రభావం ప్రారంభమవుతుంది. పరిఘ యోగం ఉదయం 10.23 గంటల వరకు కొనసాగి, ఆ తరువాత శివ యోగం ఏర్పడటం విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివ యోగం మనసుకు ప్రశాంతతను, కార్యసిద్ధిని ప్రసాదించే యోగంగా భావిస్తారు. శివయోగ ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ఆదరణ లభిస్తుంది. భూమికి సంబంధించిన వివాదాలు కొంత పరిష్కారమౌతాయి. పోటీ పరీక్షల కోసం చదువుతున్న విద్యార్ధులు శుభవార్తలు వింటారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీనికి తగ్గట్టుగానే ఆదాయం కూడా పెరుగుతుంది. నూతన అవకాశాలు వస్తాయి. వీలైనంత వరకు గతంలో మొదలుపెట్టిన పనులను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే, గౌరవంతో పాటుగా వివాదాలు కూడా పెరుగుతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. పనులను అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది.

సింహరాశి

ఈరోజు ఈరాశివారు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. శ్రమ పెరిగినప్పటికీ చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. మంచి పనులు చేసేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. కొత్త స్నేహాలతో జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. కళాకారులకు ఈరోజు కలిసి వస్తుంది.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఓ ముఖ్యమైన పనిని పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. అదనపు ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు కలిసి వస్తుంది. ఖర్చులను వీలైనంత వరకు నియంత్రించుకోవాలి.

ధనూరాశి

ఈరోజు ఈరాశిలోని కళాకారులకు కలిసి వస్తుంది. చిరువ్యాపారులకు అన్ని విధాలుగా అనుకూలమైన రోజు. ఉద్యోగులు సహోద్యోగులతో కొన్ని కీలక పనులను పూర్తిచేస్తారు. కేసులు అనుకూలంగా తీర్పులు వస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మకరరాశి

ఈరోజు ఈరాశివారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. గృహంలో శుభకార్యాలు చేపడతారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు చేతికి అందుతాయి. కేసులు పరిష్కారమౌతాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారు తీసుకునే తొందరపాటు నిర్ణయాల కారణంగా చిక్కుల్లో పడతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్ధులు చదువు పట్ల అశ్రద్ద వహించరాదు. గతంలో మీపై ఉన్న కేసులు పరిష్కారమౌతాయి. సంయమనంతో వ్యవహరించాలి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కావాలంటే నిపుణులైన పండితులను సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story