Dream Astrology: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? త్వరలో పెళ్లి జరిగే అవకాశం ఉందని అర్థం

Dream Astrology: నిద్రలో కనిపించే కలలు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని కలలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆలోచనల్లో పడేస్తాయి.

Mokshith
Published on: 11 Nov 2026 6:56 PM IST
Dream Astrology
X

Dream Astrology: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? త్వరలో పెళ్లి జరిగే అవకాశం ఉందని అర్థం

Dream Astrology: నిద్రలో కనిపించే కలలు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని కలలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆలోచనల్లో పడేస్తాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభసూచకాలుగా భావిస్తారు. ముఖ్యంగా పెళ్లి కావాలని ఎదురుచూస్తున్న వారికి కొన్ని రకాల కలలు త్వరలో వివాహ యోగం కలగబోతోందనే సంకేతాలుగా చెబుతారు.

కలలో నగలు ధరించినట్లు కనిపిస్తే..

కలలో బంగారు ఆభరణాలు లేదా ఇతర నగలు ధరించినట్లు కనిపిస్తే దాన్ని స్వప్న శాస్త్రం శుభసూచకంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా పెళ్లి కాని యువతీ యువకులకు ఇలాంటి కల వస్తే త్వరలో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉందని నమ్ముతారు. మంచి కుటుంబం నుంచి పెళ్లి సంబంధం రావడం లేదా వివాహ ప్రయత్నాలు ఫలించడం వంటి పరిణామాలకు ఇది సంకేతమని చెబుతారు. అయితే నగలు కనిపించే విధానాన్ని బట్టి కలకు అర్థం మారుతుందని కూడా సంప్రదాయ నమ్మకాలు పేర్కొంటాయి.

కలలో ఎవరైనా నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తే..

కలలో ఎవరైనా సంతోషంగా నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తే అది శుభవార్తకు సంకేతమని స్వప్న శాస్త్రంలో చెబుతారు. ముఖ్యంగా పెళ్లి కాని వారికి ఇలాంటి కల వస్తే కుటుంబంలో త్వరలో పెళ్లి వేడుక జరిగే అవకాశం ఉందని భావిస్తారు. ఇంట్లో శుభకార్యం జరగడం, బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడపడం వంటి పరిణామాలను ఈ కల సూచిస్తుందని నమ్మకం. ఇప్పటికే వివాహమైన వారికి మాత్రం భాగస్వామితో సంతోషంగా గడపడం, వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరగడం వంటి అర్థాలను చెబుతారు.

కలలో భాగస్వామితో కలిసి తిరుగుతున్నట్లు కనిపిస్తే..

మీకు కాబోయే జీవిత భాగస్వామితో కలిసి జాతరకు వెళ్లినట్లు లేదా ఏదైనా అందమైన ప్రదేశంలో తిరుగుతున్నట్లు కల వస్తే అది వివాహానికి సంబంధించిన శుభసూచకమని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇలాంటి కల వస్తే త్వరలో మంచి సంబంధం కుదిరే అవకాశం ఉందని నమ్ముతారు. జీవితంలోకి కొత్త వ్యక్తి రావడం, ప్రేమానుబంధాలు బలపడటం, వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవడం వంటి పరిణామాలకు ఇది సంకేతంగా భావిస్తారు.

తేనె, నెమలి ఈకలు కనిపిస్తే..

కలలో తేనె కనిపించడం కూడా స్వప్న శాస్త్రం ప్రకారం మంచి సంకేతంగా పరిగణిస్తారు. తేనె తియ్యదనానికి ప్రతీక కావడంతో జీవితంలో సంతోషం, ప్రేమ, అనుబంధాలు పెరుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా కలలో తేనె తింటున్నట్లు కనిపిస్తే త్వరలో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉందని చెబుతారు.

అలాగే నెమలి ఈకలు కలలో కనిపించినా శుభప్రదంగా భావిస్తారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం రావడం, వివాహ ప్రయత్నాలు విజయవంతం కావడం, పెళ్లికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవడం వంటి వాటికి ఇది సంకేతమని స్వప్న శాస్త్రంలో పేర్కొంటారు.

గమనిక: ఇవన్నీ స్వప్న శాస్త్రం, సంప్రదాయ జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా చెప్పే విషయాలు మాత్రమే. కలల్లో కనిపించే దృశ్యాలకు భవిష్యత్తు సంఘటనలను సూచించే శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.