AP Local Body Polls: వైఎస్సార్‌సీపీ శంఖారావం.. వైఎస్ జగన్ మార్క్ స్థానిక అభ్యర్థుల ప్రకటన..!

AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, నగర పంచాయతీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

Gagan kumar
Published on: 16 Oct 2026 7:20 AM IST
AP Local Body Polls
X

AP Local Body Polls: వైఎస్సార్‌సీపీ శంఖారావం.. వైఎస్ జగన్ మార్క్ స్థానిక అభ్యర్థుల ప్రకటన..!

AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న వేళ, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోనూ, వ్యూహ రచనలోనూ స్పీడ్ పెంచింది. ఎన్నికలకు అత్యంత స్వల్ప సమయం మాత్రమే ఉండటంతో, గెలుపే ఏకైక లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా విజయ తీరాలకు చేర్చగల సత్తా ఉన్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన వైసీపీ అధిష్టానం.

తాజాగా ప్రధాన కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, కీలక మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు సంబంధించి ఛైర్‌పర్సన్ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో మంచి పట్టు, ప్రజల్లో ఆదరణతో పాటు విజయావకాశాలు మెండుగా ఉన్న నాయకులకే పెద్దపీట వేస్తూ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రధాన నగరాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేందుకు ప్రముఖ నేతలకు మేయర్ పీఠాల బాధ్యతలను అప్పగించారు.

విశాఖపట్నం: వరుదు కల్యాణి

విజయవాడ: రాయని భాగ్యలక్ష్మి

నెల్లూరు: ఆనం విజయ్ కుమార్

కడప: బండి దీప్తిరెడ్డి

విజయనగరం: కోలగట్ల శ్రావణి

కర్నూలు: ఎం. సుశీల

ఏలూరు: గంటా మోహన్ రావు

మచిలీపట్నం: లంకా జ్యోతి

ఒంగోలు: కుప్పం ప్రసాద్

కార్పొరేషన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలక పురపాలక సంఘాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించింది.

పులివెందుల - వైఎస్ ప్రమీలమ్మ

బద్వేల్ - వెంకటసాయికృష్ణ

తెనాలి - మద్దాలి శేషాచలం

నర్సీపట్నం - చింతకాయల అనిత

ప్రొద్దుటూరు - పి. నర్సింహారెడ్డి

కొండపల్లి - నల్లమోతు తేజస్వి

మదనపల్లె - జింక చలపతి

పలాస - తలసు శ్రీపద్మ

చీరాల - ఇస్తర్ల షెర్లి

తుని - పిట్ల రామతులసి

రామచంద్రాపురం- నాగేశ్వరరావు

కొవ్వూరు- మన్నె పద్మ

యలమంచిలి- బి. తులసి

ఇచ్ఛాపురం - రాజ్యలక్ష్మి

నగర పంచాయతీల్లోనూ మహిళలకు, స్థానిక పట్టు ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ ఈ క్రింది పేర్లను ఖరారు చేశారు.

గురజాల: పోలు వీరారెడ్డి

కనిగిరి: పులి శాంతిరెడ్డి

కమలాపురం: మర్జుల కవిత

బుచ్చిరెడ్డిపాలెం: షేక్ షకీలా బేగం

ఉయ్యూరు: పి. దివ్య

ఏలేశ్వరం: బి. ఆశాలత

అభ్యర్థుల జాబితా విడుదలతో వైసీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొనగా, రాబోయే స్థానిక పోరులో ఏ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.