Amalapuram: అమలాపురంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం!
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
Amalapuram: అమలాపురంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం!
Amalapuram: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి ఆడిటోరియం నందు అమలాపురం అసెంబ్లీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు బద్రి బాబ్జి అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశం విజయవంతం నిర్వహించడం జరిగింది.అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులకు వారి గ్రామాల వారి ఐడి కార్డులు పంపిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గ పార్టీ బలోపేతం వైపు ప్రతియొక్క వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కలిసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు,జెడ్పీటీసీ గెడ్డం సంపదరావు,రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి మానే శ్రీను,రాష్ట్ర వాణిజ్యవిభాగ కార్యదర్శి బొడ్డు బుజ్జి,రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి చిక్కం బాలయ్యకాపు,రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి సలాది సతీష్,జిల్లా రైతు విభాగ అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు,జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు వంగా గిరిజ,మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు,మండల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




