Amalapuram: అమలాపురంలో వైఎస్సార్సీపీ నేత కుంచె రమణారావు అభినందనలు!

Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నాగవరపు పరశురాముడిని సీనియర్ నాయకులు కుంచె రమణారావు ఘనంగా సత్కరించారు.

SURESH, AMALAPURAM
Published on: 21 Sept 2026 2:37 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో వైఎస్సార్సీపీ నేత కుంచె రమణారావు అభినందనలు!

Amalapuram: జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షునిగా ఎన్నికైన నాగవరపు పరశురాముడును అమలాపురంలోని వారి స్వగృహంలో కలిసిన అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ,పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని నాగవరపు పరశురాముడికి సూచించారు.దివ్యాంగుల సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువెళ్లి,వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఆకాంక్షించారు.

వైస్సార్సీపీ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నక్క సంపత్ కుమార్,పందిరి సుబ్బరాజు, పరమట రాజశేఖర్,నేరేడుమెల్లి శ్రీనివాసరావు ఎం.వినోద్ తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM