Rare Picture: ఒకే వేదికపై జగన్, విజయ్, త్రిష, కేటీఆర్!
Rare Picture: వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు, కేటీఆర్ దంపతులు, దళపతి విజయ్, త్రిష ఒకే వేదికపై సందడి చేశారు.
Rare Picture: ఒకే వేదికపై జగన్, విజయ్, త్రిష, కేటీఆర్!
YS Jagan: రాజకీయ ప్రత్యర్థులు, విభిన్న రంగాల దిగ్గజాలు తమ విధులను పక్కనపెట్టి ఒకే చోట కలిస్తే ఆ సందడే వేరు. తాజాగా చెన్నై వేదికగా జరిగిన ఓ ఘనమైన వివాహ వేడుకలో అటువంటి అత్యంత అరుదైన, కన్నులపండువైన దృశ్యం ఆవిష్కృతమైంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ అగ్రనేతలతో పాటు తమిళ సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహ వేడుక చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి తెలుగు, తమిళ రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వివాహ వేడుకకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి వేడుకకు విచ్చేసి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న తమిళగ వెట్రి కజగం అధినేత, దళపతి విజయ్.. నటి త్రిషతో కలిసి ఈ వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సతీమణితో కలిసి విచ్చేసి వేడుకలో సందడి చేశారు.
పెళ్లి వేదికపై నూతన వధూవరులతో కలిసి వైఎస్ జగన్-భారతి, కేటీఆర్ దంపతులు, విజయ్, త్రిష అందరూ ఒకేసారి ఒకే ఫ్రేమ్‌లో నిలబడి ఫొటో దిగారు. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు, వేర్వేరు రాష్ట్రాల సమీకరణాలు ఉన్న కీలక నేతలు.. సినీ తారలతో కలిసి అత్యంత ఆత్మీయంగా ముచ్చటించడం, ఒకే వేదికను పంచుకోవడం నెటిజన్లను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ అరుదైన గ్రూప్ ఫొటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. పొలిటికల్, సినిమా గ్లామర్ కలగలిసిన ఈ కలయిక ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది.




