Razole: గోదావరిలో వీఆర్ఏల అర్ధనగ్న ప్రదర్శన వర్షంలోనూ కొనసాగుతున్న సమ్మె!

Razole: కోనసీమ జిల్లా రాజోలులో కుండపోత వర్షంలోనూ వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె కొనసాగుతోంది. పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలోకి దిగి వారు అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 23 Sept 2026 1:51 PM IST
Razole
X

Razole: గోదావరిలో వీఆర్ఏల అర్ధనగ్న ప్రదర్శన వర్షంలోనూ కొనసాగుతున్న సమ్మె!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె 8వ రోజుకు చేరుకుంది. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాజోలు పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలోకి దిగి అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన తెలిపారు.

వర్షంలో తడుస్తున్న శరీరాలు.. న్యాయం కోసం పరితపిస్తున్న మనసులు.. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు, నామినీ వీఆర్ఏల గుర్తింపు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే వీఆర్ఏలే తమ హక్కుల కోసం ఇలా నిరసనకు దిగాల్సిన పరిస్థితి రావడం ఆవేదనకరమని పేర్కొన్నారు. వారి కన్నీటి వెనుక ఉన్న ఆవేదనను అధికారులు అర్థం చేసుకుని, ఇకనైనా చర్చలకు పిలిచి సమస్యలకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE