Vijayawada: విజయవాడలో భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టురట్టు.. రూ. 5.84 కోట్ల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం!
Vijayawada: విజయవాడ శివారులో డీఆర్‌ఐ అధికారులు భారీ గోల్డ్ స్మగ్లింగ్‌ను భగ్నం చేశారు.
Vijayawada: విజయవాడలో భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టురట్టు.. రూ. 5.84 కోట్ల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం!
Vijayawada: విజయవాడ నగరంలో అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు. విజయవాడ శివారు ప్రాంతంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న ఈ సొమ్ము విలువ సుమారు రూ. 5.84 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
విజయవాడ శివారులో అధికారులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక స్కార్పియో వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో దాచి ఉంచిన 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు బంగారం క్యారియర్లను అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారు తమ నడుముకు ప్రత్యేకంగా పౌచ్‌లు కట్టుకుని వాటిలో రహస్యంగా తరలిస్తున్న 3.147 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ యూనిట్, విజయవాడ రీజినల్ యూనిట్ డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా, పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.




