Vijaya Sai Reddy : విజయసాయి కొత్త పార్టీ.. పవర్ అంతా యువతకే.!

Vijaya Sai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ శక్తి ఉదయించనుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి..

G Krishna
Published on: 13 Oct 2026 1:54 PM IST
vijay-sai-reddy
X

vijay-sai-reddy

Vijaya Sai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ శక్తి ఉదయించనుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) తన నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుపై తాజాగా అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. రాబోయే విజయదశమి (దసరా) పర్వదినం నాడు తన కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్' (Twitter) లో ఆయన ఒక సంచలన పోస్ట్ పెట్టారు. తన నూతన పార్టీ పేరు, అధికారిక జెండా, ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రధాన అజెండా అన్నీ ఈ పవిత్రమైన దసరా రోజుల్లోనే ఫైనల్ అవుతాయని ఆయన ఆ పోస్టులో వెల్లడించారు.

చౌకబారు ప్రచారాలను పట్టించుకోను..

తాను సొంతంగా పార్టీ పెడుతున్నాననే వార్తలు వచ్చినప్పటి నుంచి కొందరు తనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు, దుష్ప్రచారం చేస్తుండటంపై విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై కొందరు కావాలనే చేస్తున్న ఇటువంటి చీప్ పబ్లిసిటీ , చౌకబారు ప్రచారాలకు ఎలాంటి రాజకీయ విలువ ఉండదని ఆయన కొట్టపారేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రాజకీయాలను శాసిస్తున్న రెండు పెద్ద కుటుంబాల పార్టీల ఆధిపత్యంపై తిరుగుబాటు జెండా ఎగరేస్తామని తేల్చిచెప్పారు. కేవలం ఒకరిద్దరి గుప్పిట్లో రాజకీయాలు ఉండకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గంలోనూ యువత , సమర్థులతో మెరికల్లాంటి కొత్త నాయకత్వాన్ని తయారు చేయడమే తన పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

నాది బాల్‌ఠాక్రే పాత్ర.. పవర్ అంతా జెన్-జీదే!

తన పార్టీ నిర్మాణ శైలి , భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై విజయసాయి రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఏపీ పాలిటిక్స్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తామని చెప్పారు. పార్టీలో కీలకమైన అధికారమంతా నేటి యువతరం, అంటే 'జెన్-జీ' (Gen-Z) చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. తాను మాత్రం వెనుక ఉండి పార్టీని నడిపించే శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే తరహా పాత్రను మాత్రమే పోషిస్తానని, తెరవెనుక వ్యూహకర్తగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దసరా పండుగ నాడు ఆయన ప్రకటించబోయే కొత్త పార్టీ వివరాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.