Vetapalem: శ్మశానవాటిక స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వివేకానంద కాలనీవాసుల విజ్ఞప్తి!
Vetapalem: బాపట్ల జిల్లా వేటపాలెం చల్లారెడ్డిపాలెం పంచాయతీ వివేకానంద కాలనీలో శ్మశానవాటిక సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు విజ్ఞప్తి చేసిన వాసులు.
Vetapalem: శ్మశానవాటిక స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వివేకానంద కాలనీవాసుల విజ్ఞప్తి!
Vetapalem: చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని స్వామి వివేకానంద కాలనీలో ఏళ్ల తరబడి వేధిస్తున్న శ్మశానవాటిక సమస్యను తక్షణమే పరిష్కరించి, స్థలాన్ని కేటాయించాలని కాలనీ వాసులు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ఆవేదనను వ్యక్తంచేస్తూ— "సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్న మా కాలనీలో శ్మశానవాటిక లేకపోవడం పెద్ద శాపంగా మారింది.
గత ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు" అని తెలిపారు.
గత సెప్టెంబరు 25న కాలనీలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినప్పుడు అంత్యక్రియలు నిర్వహించడానికి అనువైన స్థలం లేక నరకయాతన అనుభవించామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ ప్రజల ఆవేదనను ఆలకించిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, శ్మశానవాటికకు తగిన స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ టి. శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ పార్థసారథి, సెక్రెటరీ విజయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఖాజావలితో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.




