Vetapalem: జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్న వేటపాలెం యువకుడు!
Vetapalem: బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన గాత్రం బాలాజీ మోహన్ కృష్ణకు జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ఎక్సలెన్స్ అవార్డు లభించింది.
Vetapalem: జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్న వేటపాలెం యువకుడు!
Vetapalem: ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో నా భారతదేశం 80 సంవత్సరాల ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛ అనే ఇతివృత్తంతో జాతీయస్థాయి ఫోటోగ్రఫీ పోటీలను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు నిర్వహించారు.
బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన గాత్రం బాలాజీ మోహన్ కృష్ణ తీసిన ఫోటోకు ఎక్సలెన్స్ అవార్డు ఆఫ్ ద ఇయర్ 2026 అవార్డును మహాత్మా గాంధీ 157 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కే గంగాధరరావు గారు ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్ ఏఎన్యూ విశిష్ట అతిధులు శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ ఆర్ మల్లికార్జున రావు గారు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏపీ సి సి సి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధ్యక్షులు మరియు ప్రొఫెసర్ ఎం సురేష్ కుమార్ గారు ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ అండ్ లా మరియు ప్రొఫెసర్ ఎం సురేష్ కుమార్ గారు గాంధీ స్టడీస్ గౌరవ అతిథులు ప్రొఫెసర్ ఆర్ శివరాం ప్రసాద్ గారు రెక్టార్ ఇంచార్జ్ ఏఎన్యూ ప్రొఫెసర్ జి సింహాచలం గారు రిజిస్టర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ తమ్మ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు జ్యూరీ మెంబర్లకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది




