Markapur: మార్కాపురం కలెక్టరేట్ వద్ద వెలిగొండ నిర్వాసితుల ఆందోళన!

Markapur: మార్కాపురం కలెక్టరేట్ ఎదుట వెలిగొండ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేత రమాదేవి ప్రభుత్వాన్ని నిలదీశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 21 Sept 2026 2:48 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం కలెక్టరేట్ వద్ద వెలిగొండ నిర్వాసితుల ఆందోళన!

Markapur: మార్కాపురం కలెక్టరేట్‌ ఎదుట వెలిగొండ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు ఇళ్ల స్థలాలు, పరిహారం, పునరావాస సౌకర్యాలు వెంటనే కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టేందుకు నిర్వాసితులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుపై సీపీఎం రాష్ట్ర నాయకురాలు రమాదేవి తీవ్ర విమర్శలు చేశారు. “వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు ఇచ్చేటప్పుడు రోజూ తిరిగిన మంత్రి.. ఇప్పుడు ఎక్కడ?” అంటూ ప్రశ్నించారు.

“ఒక్క నిర్వాసితుడికైనా పరిహారం చెల్లించారా? 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైంది?” అంటూ నిలదీశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM