Giddalur: కొమరోలు మండలం నల్లగుంట్ల సర్పంచ్ అరుణ కుమారిని సత్కరించిన నేతలు!
Giddalur: నల్లగుంట్ల ఏకగ్రీవ సర్పంచ్ అరుణ కుమారిని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
Giddalur: కొమరోలు మండలం నల్లగుంట్ల సర్పంచ్ అరుణ కుమారిని సత్కరించిన నేతలు!
Giddalur: కొమరోలు మండలం నల్లగుంట్ల పంచాయతీకి కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి పంకు అరుణ కుమారి గారు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు స్వర్ణ గ్రామ సచివాలయ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆమెను శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నల్లగుంట్ల పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తూ, గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.కార్యక్రమంలో కొమరోలు మండల కూటమి నాయకులు , పంకు రాజ గోపాల్, రాజ మోహన్ , మేడం జ్యోతినాథ్ రెడ్డి, రాజేశ్వర రెడ్డి, ఎల్పుల మహేంద్ర, చెన్నారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, బొడ్డు కిరణ్, రాజేశ్వర రావు, చల్లా రామకృష్ణ రెడ్డి, మంద నాగయ్య, అబ్రహాం తదితరులు మంత్రి గారిని మరియు MLA గారిని కలిశారు.




