Tirupati Vaikunta Dwara Darshan: భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ!

Tirupati Vaikunta Dwara Darshan: డిసెంబర్ 20 నుంచి 29 వరకు జరగనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, ఈ-డిప్ టోకెన్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. తొలి రెండు రోజులు వీఐపీ, రూ.300 దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించింది.

Arun Chilukuri
Published on: 27 Nov 2026 2:31 PM IST
Tirupati Vaikunta Dwara Darshan
X

Tirupati Vaikunta Dwara Darshan: భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ!

Tirupati Vaikunta Dwara Darshan: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు పది రోజుల పాటు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ టీటీడీ పలు కీలక మార్పులు చేసింది.

వైకుంఠ ద్వార దర్శన టికెట్లు & టోకెన్ల విడుదల షెడ్యూల్:

నవంబర్ 28 (ఉదయం 10 గంటలకు): శ్రీవాణి (SRIVANI) దర్శన టికెట్ల కోటా విడుదల.

నవంబర్ 30 (ఉదయం 10 గంటలకు): రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన (SED) టికెట్ల కోటా విడుదల.

డిసెంబర్ 1 నుంచి 5 వరకు: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ల కోసం భక్తులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్ (e-Dip) విధానంలో నమోదు చేసుకోవచ్చు.

డిసెంబర్ 7 (మధ్యాహ్నం 3 గంటలకు): ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేటాయింపు.

డిసెంబర్ 8 (ఉదయం 10 గంటలకు): దాతల (Donors) దర్శన కోటా టికెట్ల విడుదల.

తొలి రెండు రోజులు వీఐపీ, రూ.300 దర్శనాలు రద్దు:

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది.

ఈ రెండు రోజుల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను సైతం రద్దు చేశారు. డిసెంబర్ 20, 21 తేదీలకు కేవలం ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయించే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శన అవకాశం ఉంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.