Chintoor: చింతూరులో ముమ్మర ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహాలు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు జడ్పీటీసీ స్థానానికి త్రిముఖ పోటీ. వైఎస్సార్‌సీపీ నుంచి సవలం అమల, జనసేన నుంచి తీగల కవిత, సీపీఎం నుంచి మీడియం శ్రీదేవి బరిలో. ప్రచారం ముమ్మరం.
Chintoor: చింతూరులో ముమ్మర ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహాలు!
Chintoor: స్థానిక సమరంలో చింతూరు జడ్పిటిసి పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారో అని ప్రజలలో ఆసక్తి నెలకొంది. చింతూరు జడ్పిటిసి స్థానానికి త్రిముఖ పోటీ జరగనుంది.జడ్పిటిసి అభ్యర్థులుగా వైఎస్ఆర్సిపి నుంచి సవలం అమల, జనసేన నుంచి తీగల కవిత, సిపిఎం నుంచి మీడియం శ్రీదేవి బరిలో ఉన్నారు.
మంగళవారం నామినేషన్ విత్ డ్రా పర్వం ముగిసింది. బుధవారం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు.ఆయా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాలలో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి తమ అభ్యర్థులని గెలిపించాలంటూ ప్రచారం, మంతనాలు మొదలుపెట్టారు.
జడ్పిటిసి అభ్యర్థులుగా బరిలో దిగిన తీగల కవిత,మీడియం శ్రీదేవి, సవలం అమల లు తమను గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేసి చూపెడతామని హామీలు ఇస్తున్నారు.గత ఎన్నికల్లో చింతూరు జడ్పిటిసి స్థానాన్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది.ప్రస్తుతం వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సవలం అమల చింతూరు ఎంపీపీగా విధులు నిర్వర్తించారు.రాజకీయాల పై అమల కు గట్టి పట్టుందని చెప్పవచ్చు.
వ్యూహ ప్రతి వ్యూహాల తో అమల ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు. జనసేన అభ్యర్థి తీగల కవిత చింతూరు ఏజెన్సీలోని జనసైనికులతో, కూటమి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి గెలుపు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. సిపిఎం నుంచి పోటీకి దిగిన మీడియం శ్రీదేవి విప్లవ ఉద్యమాలు, పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తి.
ప్రజా సమస్యలే టార్గెట్ చేస్తూ ప్రజల ఓటు బ్యాంకు పెంచుకొని గెలిచేందుకు శ్రీదేవి, సిపిఎం పార్టీ ముందుకు కదులుతుంది. ఏది ఏమైనా ఈ స్థానిక సమరంలో ప్రజలు ఏ అభ్యర్థి కి పట్టం కడతారో చూడాల్సి ఉంది.




