Nandyal: అవుకులో విద్యార్థి మృతితో ఉద్రిక్తత స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమంటూ ఆందోళన!
Nandyal: నంద్యాల జిల్లా అవుకులో ప్రైవేట్ పాఠశాల విద్యార్థి నిఖిల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Nandyal: అవుకులో విద్యార్థి మృతితో ఉద్రిక్తత స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమంటూ ఆందోళన!
Nandyal: నంద్యాల జిల్లా ప్రవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం. విద్యార్థి మృతి, అవుకు సెయింట్ మేరీ హైస్కూల్ వద్ద ఉద్రిక్తత. భారీగా మోహరించిన పోలీసులు. నంద్యాల జిల్లా అవుకు మండల కేంద్రంలో సెయింట్ మేరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో 8వ తరగతి విద్యార్థి నిఖిల్(13) అవుకు బస్టాండు వద్ద అనుమానస్పద మృతి.
మృతి చెందిన విద్యార్థి తోక నిఖిల్ స్వగ్రామం కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించిన పోలీసులు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు. సమాచారం అందుకున్న బాలుడు తల్లిదండ్రులు తోక సురేష్ తోక ఇందిరమ్మ ఘటన స్థలానికి చేరుకొని విగతజీవిగా పడిఉన్న తమ కుమారుడిని చూసి బోరున పన్నీరు మునీరుగా విలపించారు.
అవుకు సెయింట్ మేరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హాస్టల్ లో ఉన్న తన కుమారుడు బస్టాండ్ దగ్గర చనిపోయి ఉండడం అనుమానాస్పదంగా ఉందని హత్య చేసి చంపారని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు ఆగ్రహించిన మృతుడు బాలుని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా స్కూల్ యాజమాన్యంపై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
కాసేపు మృతుని బంధువులు పోలీసులు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముమ్మాటికి నా కొడుకుది హత్య అని బాలుడి తల్లి మీడియాకు తెలిపింది. ఘటన స్థలానికి చేరుకున్న బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి. బాలుడు మృతదేహాన్ని అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.




