Chintoor: చింతూరులో జనసేన అభ్యర్థి తీగల కవిత జోరుగా ప్రచారం!

Chintoor: అల్లూరి జిల్లా చింతూరు మండలంలో కూటమి జనసేన అభ్యర్థి తీగల కవిత ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని వెల్లడి.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Nov 2026 9:25 AM IST
Chintoor
X

Chintoor: చింతూరులో జనసేన అభ్యర్థి తీగల కవిత జోరుగా ప్రచారం!

Chintoor: చింతూరు మండలంలో కూటమి జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న వీర మహిళ తీగల కవిత ప్రచారం జోరుగా సాగుతోంది. మండలంలోని మారుమూల గ్రామాల్లో సైతం ఆమె పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రచారంలో భాగంగా ఆమెకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. జన సైనికులు, కూటమి కార్యకర్తలు ఆమె విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను చైతన్య పరుస్తున్నారు.

ఈ సందర్భంగా తీగల కవిత మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, పారిశుధ్య వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సమస్య పరిష్కారం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR