TDP: స్థానిక ఎన్నికల ముందు టీడీపీ సంచలనం.. కీలక నేతలపై వేటు!

TDP: కర్నూలు జిల్లా ఆలూరు, హొళగుంద జడ్పీటీసీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ధిక్కరించి స్వతంత్రంగా పోటీకి దిగిన టీడీపీ నాయకులు బెంగళూరు కిషోర్, ఇడిగ గోవిందులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Gagan kumar
Published on: 31 Oct 2026 9:04 AM IST
TDP
X

TDP: స్థానిక ఎన్నికల ముందు టీడీపీ సంచలనం.. కీలక నేతలపై వేటు!

ZPTC Elections: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఎన్నికల బరిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు షాక్ ఇస్తూ, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ఇద్దరు సీనియర్ తెలుగుదేశం నాయకులపై జిల్లా అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంది. కూటమి నిబంధనలను ఉల్లంఘించి స్వతంత్ర అభ్యర్థులుగా రేసులోకి దిగినందుకు గానూ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది.

ఆలూరు జడ్పీటీసీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగిన బెంగళూరు కిషోర్, అలాగే హొళగుంద జడ్పీటీసీ స్థానంలో స్వతంత్రంగా బరిలో నిలిచిన ఇడిగ గోవిందులపై ఈ సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పార్టీ క్రమశిక్షణను దాటి ప్రవర్తించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి తరఫున బి-ఫారమ్ పొందిన అధికారిక అభ్యర్థుల విజయానికే నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, రెబెల్ అభ్యర్థులకు ఏ రకమైన సహకారం అందించినా వారిపై కూడా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సస్పెన్షన్ వేటుతో ఆలూరు నియోజకవర్గ రాజకీయం మరింత వేడెక్కింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.