AP Local Body Elections: 36 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల..!
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ 36 మందితో తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
AP Local Body Elections: 36 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల..!
TDP Releases First Candidate List : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పరాకాష్ఠకు చేరింది. ఎన్డీయే కూటమి సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన వెంటనే, తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. తొలి విడతగా 36 స్థానాలకు సంబంధించిన మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ తొలి జాబితాలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు,29 మున్సిపాలిటీలు,నగర పంచాయతీలు ఉన్నాయి.
ఎన్డీయే కూటమి ఒప్పందం ప్రకారం మొత్తం 11 కార్పొరేషన్లలో టీడీపీ పోటీ చేయనుండగా, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 10 స్థానాల్లో మొదటి దఫాగా 7 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను ఖరారు చేసింది.
1. విశాఖపట్నం: ముక్కా శ్రావణి
2. విజయనగరం: అనవపు భార్గవి
3. కర్నూలు: విజయ ప్రత్యూష
4. కడప: నెల్లుటూరి సువర్ణ
5. నెల్లూరు: రూప్ కుమార్
6. చిత్తూరు: కటారి హేమలత
7. తిరుపతి: మన్నెం శ్రీనివాస ప్రసాద్
కూటమి భాగస్వామ్యంలో భాగంగా టీడీపీ మొత్తం 78 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలలో పోటీ చేస్తోంది. ఇందులో మొదటి విడతగా ప్రకటించిన 29 స్థానాల అభ్యర్థుల వివరాలు ఇవే.
ఆళ్లగడ్డ: అనీషా షేక్
అద్దంకి: కాకాని అశోక్
ఆదోని: నాగమణి
ఆత్మకూరు: గోవిందరాజులు
బద్వేలు: దివ్యతేజ
బొబ్బిలి: రేణుకాదేవి
దాచేపల్లి: టి. శ్రీనివాసరావు
ధర్మవరం: పరిశె సుధాకర్
మాచర్ల: ఏనుముల సుష్మ
మదనపల్లె: చిన్నబాబు
మార్కాపురం: మల్లికార్జున
నగరి: శ్రీనివాసన్
పలాస-కాశీబుగ్గ: వజ్జ గంగాభవాని
పెద్దాపురం: ఎల్.ఎస్.ఎన్. రాజు
పెనుకొండ: త్రివేంద్రమూర్తి
పులివెందుల: గీతాకుమారి
రాజంపేట: గాయత్రి
రామచంద్రపురం: శేషారావు
రాయచోటి: ఖాదర్ వలీ
రాయదుర్గం: హనుమంతు
రేపల్లె: అపర్ణ
సూళ్లూరుపేట: సుహాసిని
ఈ జాబితాను పరిశీలిస్తే సామాజిక సమీకరణాలు, బీసీ, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లో పట్టున్న స్థానిక నాయకులకు తెలుగుదేశం పార్టీ పీఠం వేసినట్లు స్పష్టమవుతోంది. పులివెందుల, మాచర్ల వంటి కీలక ప్రాంతాల్లోనూ అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ప్రత్యర్థులకు గట్టి సవాలు విసిరింది. మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.




