Chintoor: ఏడుగురాళ్లపల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బత్తుల నాగమణి ఇంటింటా ప్రచారం!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి బత్తుల నాగమణి జోరుగా ప్రచారం. చిన్నారెడ్డి, ఆసిఫ్‌ల నేతృత్వంలో ఇంటింటా ప్రచారం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 29 Oct 2026 9:00 AM IST
Chintoor
X

Chintoor: ఏడుగురాళ్లపల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బత్తుల నాగమణి ఇంటింటా ప్రచారం!

Chintoor: ఏడుగురాళ్లపల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బత్తుల నాగమణి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు.

ఆమె గెలుపు కోసం టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు ఆసిఫ్ కలిసి ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి బత్తుల నాగమణిని గెలిపించాలని కోరుతున్నారు. గ్రామంలో ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR