Chintoor: చింతూరు స్థానిక సమరంలో టీడీపీ మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్ హవా!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు స్థానిక ఎన్నికల్లో టీడీపీ మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్ వ్యూహాలు ఫలిస్తాయా? కూటమి మెజారిటీ స్థానాలు సాధిస్తుందా అనే అంశంపై ఆసక్తికర విశ్లేషణ.
Chintoor: చింతూరు స్థానిక సమరంలో టీడీపీ మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్ హవా!
Chintoor: చింతూరు స్థానిక సమరంలో టిడిపి మండల అధ్యక్షులు జమాల్ ఖాన్ మంత్రం ఫలిస్తుందా, కూటమి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనాన్ని సృష్టిస్తుందా అనే ఉత్కంఠ ప్రజలలో నెలకొంది.కూటమి తరుపున బరిలోకి దిగుతున్న అభ్యర్థులు తమ విజయం జమాల్ ఖాన్ ప్రచారం మీద ఆధారపడి ఉందని చెబుతున్నారు.
జమాల్ ఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ జమాల్ ఖాన్ ప్రజలలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.కొన్ని అనుకోని పరిణామాల దృష్ట్యా చింతూరు టిడిపి మండల అధ్యక్షుల పదవిని జమాల్ ఖాన్ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.జమాల్ ఖాన్ కు ఉన్న గుర్తింపుకు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం తరపున అధిష్టానం మంచి పదవి అప్పగించి ఆయన సేవలను ఉపయోగించుకుంటే బాగుండేది అని పలువురు చెబుతున్నారు.
చింతూరు టిడిపి మండల అధ్యక్షులుగా ఎన్నికైన అప్పటినుంచి జమాల్ ఖాన్ ప్రజలలో మరింతగా దూసుకుపోతున్నారు.దింతో చింతూరు మండలంలో టిడిపి బలం పుంజుకుంది. జమాల్ ఖాన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నైరాస్యం లో ఉన్న చింతూరు టిడిపి శ్రేణులలో నూతన ఉత్సాహం పెల్లుబికింది.
చింతూరు మండలంలో గత స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రభంజనం సృష్టించి 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 8 స్థానాలు, జడ్పిటిసి స్థానాన్ని కైవసం చేసుకుని తన సత్తాను చాటి చెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో 18 పంచాయతీలకు గాను 18 పంచాయతీలు గెలుపొంది వైఎస్ఆర్సిపి చింతూరు మండలంలో చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతం టిడిపి చింతూరు రథసారథిగా జమాల్ ఖాన్ ఉండడంతో ఈ స్థానిక సమరంలో టిడిపి పుంజుకుంటుందని పలువురు చెబుతున్నారు.చింతూరు మండలంలో జమాల్ ఖాన్ పేదలకు, మధ్యతరగతి ప్రజలకు,ఆపదలో ఉన్న వారికీ చేసిన సేవలు చిరస్మరణీయం.
మండలంలోని గ్రామాలలో జమాల్ ఖాన్ కు గుర్తింపును ప్రజలలో మరింతగా చేరవేస్తే స్థానిక సమరంలో ఫలితాలు తారుమారవుతాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.పోటీలో ఉన్న అభ్యర్థులు జమాల్ ఖాన్ తమకు ప్రచారం చేస్తే విజయం తద్యమని భావిస్తున్నారు.మరి జమాల్ ఖాన్ మదిలో ఏ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ప్రచారం చేస్తారో చూడాల్సి ఉంది.ఈ లోకల్ ఫైట్ లో జమాల్ ఖాన్ మంత్రం ఫలిస్తుందా ? ఫలించదా? అనే దాని పై పలువురిలో ఉత్కంఠ నెలకొంది.




