Tripuranthakam: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎరిక్షన్ బాబు!

Tripuranthakam: త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పరామర్శించారు.

Srikanth Singam, Markapur
Published on: 23 Sept 2026 2:27 PM IST
Tripuranthakam
X

Tripuranthakam: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎరిక్షన్ బాబు!

Tripuranthakam: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సోమేపల్లి గ్రామానికి చెందిన నార్నపాటి కోటేశ్వరరావు, పల్లెపోగు ప్రసాద్ భౌతికకాయాలకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, టీడీపీ కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రమాదంలో ఇద్దరు గ్రామస్తులు మృతి చెందడం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur