Chintoor: అధికారులు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే ప్రయాణాలు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లో అర్నబ్ తుపాను ప్రభావంపై సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో చిట్టపులి నరేంద్ర పడాల్ క్షేత్రస్థాయి పర్యటన.
Chintoor: అధికారులు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే ప్రయాణాలు!
Chintoor: అర్నబ్ తుపాను నేపథ్యంలో చింతూరు డివిజన్ లో సబ్ కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చిట్టపులి నరేంద్ర పడాల్, ఐఏఎస్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.మోతుగూడెం, నేలకోట, కొత్తపల్లి, దేవరపల్లి ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి, విద్యుత్ సరఫరా, రాకపోకల ఇబ్బందులను పరిశీలించారు.
అలాగే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే తులసిపాక, సోకిలేరు వ్యూ పాయింట్లను సందర్శించి భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.తుపాను ప్రభావం తగ్గే వరకు అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు, ప్రమాదకర ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని, వాగులు, వంకలు, నీరు ప్రవహించే రహదారులకు దూరంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఈ పర్యటనలో ఓ ఎస్ డి (అడ్మినిస్ట్రేషన్) జావలి, చింతూరు డిఎస్పి ఉదయ పావని పాల్గొన్నారు.




