Antharvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.లక్ష శాశ్వత విరాళం!
Antharvedi: కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి నిత్య సుదర్శన హోమం కోసం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాగి సీతారామరాజు కుటుంబం రూ.లక్ష శాశ్వత విరాళం అందించింది.
Antharvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.లక్ష శాశ్వత విరాళం!
Antharvedi: అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య సుదర్శన హోమానికి శాశ్వత విరాళంగా రూ.1,00,000లను పశ్చిమగోదావరి జిల్లా దిరుసుమర్రు గ్రామానికి చెందిన సాగి సీతారామరాజు, వారి కుటుంబ సభ్యులు సమర్పించారు.
ఈ సందర్భంగా సాగి సీతారామరాజు కుటుంబ సభ్యులు ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు శ్రీ స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
నిత్య సుదర్శన హోమం నిర్వహణకు భక్తులు అందిస్తున్న విరాళాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని, భక్తులు తమ శక్తి మేరకు దేవస్థానానికి విరాళాలు అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరిస్తున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్ తెలిపారు.




