MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి పోలీసుల షాక్.. ఇంటికెళ్లి నోటీసులు
MP Avinash Reddy: వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి స్థానిక పోలీసులు నోటీసులు జారీ చేశారు.
MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి పోలీసుల షాక్.. ఇంటికెళ్లి నోటీసులు
MP Avinash Reddy: వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానిక పోలీసు సిబ్బంది నేరుగా వైఎస్ అవినాష్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఈ నోటీసులను అందజేశారు.
నేరుగా నోటీసులు ఇవ్వడంతో పాటు, అధికారిక సమాచార నిమిత్తం ఆయనకు వాట్సప్‌లోనూ నోటీసు కాపీని పంపించారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా నియోజకవర్గంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.




