Markapuram: మార్కాపురంలో డ్రైన్ల ఆక్రమణలపై ప్రజల తీవ్ర ఆగ్రహం!
Markapuram: మార్కాపురంలో డ్రైన్ల ఆక్రమణలతో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యలు, మురుగు పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులను కోరుతున్న ప్రజలు.
Markapuram: మార్కాపురంలో డ్రైన్ల ఆక్రమణలపై ప్రజల తీవ్ర ఆగ్రహం!
Markapuram: పట్టణంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో డ్రైన్లు, మురుగు కాలువలపై జరుగుతున్న ఆక్రమణలను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డ్రైన్లపై అక్రమ నిర్మాణాలతో మురుగు పారుదల వ్యవస్థ దెబ్బతినడంతో పాటు రహదారులు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్టాండ్ నుంచి తర్లుపాడు రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వరకు చేరుకోవడానికి సుమారు అరగంట సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. దీంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి మురుగు పారుదల వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




