Chintoor: చింతూరు కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలవరం జిల్లా ఎస్పీ!

Chintoor: చింతూరు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలవరం జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి ఐపీఎస్.

RAJESH REDDY, CHINTOOR
Published on: 6 Nov 2026 1:41 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలవరం జిల్లా ఎస్పీ!

Chintoor: రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలవరం జిల్లా ఎస్పీ శ్రీ కే. చక్రవర్తి ఐపీఎస్ గారు ఆదేశించారు.చింతూరు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సుల భద్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాల ఫుటేజ్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, భద్రతా విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.

ఈ కౌంటింగ్ కోసం సుమారు 150 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో సివిల్ సిబ్బందితో పాటు ఏపీఎస్పీ, ఏఆర్, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా పాల్గొంటారు.ఫలితాల ప్రకటన అనంతరం కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ తనిఖీలో అడ్మిన్ మంద జావలి ఆల్ఫోన్స్, డీఎస్పీ ఉదయపావని, ఎస్బీ సీఐ భానుప్రసాద్, సీఐ గోపాలకృష్ణ, ఆర్ఐ వీరప్రసాద్ బాబు, ఆర్ఎస్ఐ గణేష్, ఎస్ఐ సంతోష్ కుమార్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR