AP Local Body Elections: సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్ భేటీ.. కాన్వాయ్ లేకుండా ఒంటరిగా నివాసానికి!

AP Local Body Elections: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు. మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం ఉత్తర్వులు, రెబల్స్ వ్యవహారం మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ.

Arun Chilukuri
Published on: 22 Oct 2026 12:37 PM IST
AP Local Body Elections
X

AP Local Body Elections: సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్ భేటీ.. కాన్వాయ్ లేకుండా ఒంటరిగా నివాసానికి!

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం హుటాహుటిన భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ జరుగుతున్న తాజా పరిణామాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు.

ఈ భేటీకి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలాంటి కాన్వాయ్ కానీ, సెక్యూరిటీ లగ్జరీ వాహనాల హంగామా కానీ లేకుండా అత్యంత సాధారణంగా ఒంటరిగా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కొద్దిసేపు సీఎంతో లోతుగా చర్చలు జరిపిన అనంతరం ఆయన తిరిగి బయలుదేరి వెళ్లిపోయారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తదుపరి అనుసరించాల్సిన వ్యూహం మరియు కొత్త పోలింగ్ తేదీల సమన్వయంపై వీరిద్దరూ చర్చించారు.

త్వరలో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలలో కూటమి భాగస్వామ్య పక్షాల విజయానికి అనుసరించాల్సిన ప్రచార ప్రణాళికపై సమీక్షించారు.

పలు స్థానాల్లో పోటీలో ఉన్న తిరుగుబాటు (రెబల్) అభ్యర్థులను బుజ్జగించడం, కూటమి ధర్మానికి కట్టుబడి పోటీ నుంచి విరమించుకునేలా చేయడంపై ఇరువురు నేతలు కీలక సమాలోచనలు జరిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.