AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేనాని ప్రత్యేక దృష్టి.. పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు!

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు.

Arun Chilukuri
Updated on: 9 Oct 2026 2:19 PM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేనాని ప్రత్యేక దృష్టి.. పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు!

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సన్నద్ధత, సమాచార సేకరణపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ సంస్థాగత బలోపేతం మరియు క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీలను నియమించారు. విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా అన్ని పార్లమెంట్ స్థానాలకు ఈ కమిటీలను ప్రకటించాలని నిర్ణయించారు.

ఈ కమిటీల పనితీరును పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా త్వరలోనే ప్రతీ పార్లమెంట్ కమిటీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై నేరుగా దిశానిర్దేశం చేయనున్నారు.

స్థానిక ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా మరో నాలుగు కీలక కేంద్ర కమిటీలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ

కూటమి సమన్వయ కమిటీ

ప్రచార కమిటీ

ట్రెజరీ కమిటీ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా జనసేనాని ముందుచూపుతో వేస్తున్న ఈ అడుగులు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.