Markapur: సైకిల్‌పై వెళ్లి నీటి సరఫరా సమస్యను పరిష్కరించిన కార్మికుడు!

Markapur: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లిలో సైకిలపై వెళ్లి మోటార్ కనెక్షన్లు సరిచేసి తాగునీటి సమస్యను పరిష్కరించిన పంచాయతీ కార్మికుడు రంగస్వామి.

Srikanth Singam, Markapur
Published on: 23 Sept 2026 1:48 PM IST
Markapur
X

Markapur: సైకిల్‌పై వెళ్లి నీటి సరఫరా సమస్యను పరిష్కరించిన కార్మికుడు!

Markapur: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నీటి సరఫరాకు సంబంధించిన మోటార్ కనెక్షన్లను మార్చి, నీటిని అక్రమంగా స్వప్రయోజనాలకు వినియోగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు పంచాయతీ మోటార్ కనెక్షన్లలో మార్పులు చేయడంతో గ్రామంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న మిద్దె రంగస్వామి వెంటనే స్పందించారు. ఆయన ద్విచక్ర వాహనం మరమ్మతులకు గురికావడంతో యడవల్లి గ్రామానికి సైకిల్‌పై వెళ్లి, మోటార్‌కు సంబంధించిన విద్యుత్‌ వైర్లను పరిశీలించి, మార్చబడిన కనెక్షన్లను సరిచేశారు. అనంతరం గ్రామంలో నీటి సరఫరా పునరుద్ధరించడంతో గ్రామస్థుల సమస్యకు పరిష్కారం లభించింది.

పంచాయతీ నీటిని అక్రమంగా వినియోగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన నీటి సరఫరా వ్యవస్థను కొందరు స్వప్రయోజనాలకు వినియోగించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామపంచాయతీ అధికారులు మోటార్ కనెక్షన్లు, విద్యుత్‌ వైర్ల భద్రతపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టి నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur