Markapuram: మార్కాపురం నూతన డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ!

Markapuram: మార్కాపురం సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణే తన లక్ష్యమని వెల్లడి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Oct 2026 9:36 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం నూతన డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ!

Markapuram: మార్కాపురం సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ శనివారం ఉదయం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పుట్టపర్తి డీఎస్పీగా పనిచేస్తున్న ఆయన బదిలీపై మార్కాపురానికి వచ్చారు. గతంలో మార్కాపురం డివిజన్ పరిధిలోని పెద్దారవీడు ఎస్‌ఐగా కూడా విధులు నిర్వహించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ మార్కాపురం సబ్‌డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

నూతన డీఎస్పీకి అభినందనలు

నిమ్మగడ్డ సత్యనారాయణ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించడంతో మార్కాపురం సబ్‌డివిజన్ పరిధిలోని మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి , వేమన, సైదుబాబు మరియు పోలీసు సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM