VR Puram: శ్రీరామగిరి రామాలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించిన కూటమి జడ్పీటీసీ అభ్యర్థి!
VR Puram: వి.ఆర్.పురంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి వాళ్ల విష్ణుప్రియ ఎన్నికల ప్రచార హోరు. శ్రీరామగిరి రామాలయంలో ప్రత్యేక పూజలు, టీడీపీ మండల అధ్యక్షుడు బొర్రా నరేష్ నేతృత్వంలో ఇంటింటి ప్రచారం.
VR Puram: శ్రీరామగిరి రామాలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించిన కూటమి జడ్పీటీసీ అభ్యర్థి!
VR Puram: వి.ఆర్.పురం మండల టీడీపీ అధ్యక్షులు బొర్రా నరేష్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ కూటమి అభ్యర్థి వాళ్ల విష్ణుప్రియ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.శుక్రవారం శ్రీరామగిరిలోని రాముని ఆలయంలో విష్ణుప్రియ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకుని మండల ప్రజల శ్రేయస్సు కోసం మొక్కుకున్నారు.అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు బొర్రా నరేష్ నేతృత్వంలో శ్రీరామగిరి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




